ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలి
ABN , Publish Date - May 13 , 2026 | 12:37 AM
ధాన్యం, మొక్కజొన్న పంట కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాల ని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
సిరిసిల్ల, మే 12 (ఆంధ్రజ్యోతి) : ధాన్యం, మొక్కజొన్న పంట కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాల ని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లపై ఉపము ఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, దానసరి అనసూయ సీతక్క, అడ్లూ రి లక్ష్మణ్‌కుమార్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె రామకృష్ణా రావు ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలె క్టర్లతో మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించగా, రాజన్నసిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు. ఈ సందర్భం గా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న ప్రతి ప్రైవేట్ గోదామును అవసరమైతే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకో వాలని, అవసరమైన అన్ని చట్టాలను వినియోగించి నిల్వ సదుపాయాలను పెంచాలని సూచించారు. కమ్యూనిటీ హాళ్లు, రైతు బజార్లను తాత్కాలిక షెడ్లుగా వినియోగించాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీలు, ఉన్నత స్థాయి పోలీసు అధికారులు, రవాణా శాఖ అధికారులు కొనుగోలు ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని, అవసర మైన వాహనాల ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో స్థానిక హమాలీలను వంద శాతం వినియోగించు కునేలా కార్యాచరణ రూపొందిం చాలని, ఎక్కడా కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. హమాలీలు అధిక మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తే వారి లైసెన్సులను రద్దు చేయాలని, అవసరమైన పోలీసు సహకారం తీసుకోవాలని స్పష్టం చేశారు. కొన్ని చోట్ల ధాన్యం రైస్ మిల్లులకు చేరిన తర్వాత రైతులకు కోతలు జరుగుతున్నాయని, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదని స్పష్టం చేశారు.పంట రవాణా కోసం ఖాళీగా ఉన్న అన్ని వాహనాలు, ట్రాక్టర్లు, డీసీఎంలను పూర్తిస్థాయిలో వినియోగించాలని ఆదేశిం చారు. కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్ కవర్లు సిద్ధం గా ఉంచాలని సూచించారు. తడిసిన ధాన్యం కొనుగో ళ్లకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రతి రైస్ మిల్లుకు కొనుగోళ్ల పర్యవేక్షణ కోసం సమర్థవంత మైన అధికారిని నియమించాలని, ఆయా అధికారులు ప్రతి రోజూ నివేదికలు పంపించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి వచ్చే ప్రతికూల వార్త లకు రిజాయిండర్లు క్రమం తప్పకుండా మీడియాకు పంపించాలని సూచించారు. ప్రతి రోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి కొనుగోళ్ల పురోగతిని సమీక్షించాలని ఆదేశిం చారు. కొనుగోళ్ల అంశాన్ని తేలికగా తీసుకునే అధికారు లపై వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం వాహనాలు ఇవ్వని ట్రాన్సఫోర్టు కాంట్రాక్టర్లపై అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
- పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
యాసంగి సీజన్‌లో తెలంగాణ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 52లక్షల మెట్రిక్‌టన్నుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించిందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యా ప్తంగా 8575 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 25 లక్షల 78 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల వద్ద 11లక్షల 52వేల టన్నుల ధాన్యం పెండింగ్‌లో ఉంద న్నారు. రైతులకు కనీసమద్దతు ధర చెల్లిం పుల కోసం ఇప్పటివరకు రూ 3873 కోట్ల ను బ్యాంకుల ద్వారా విడుదల చేసినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా18 కోట్ల 68లక్షల గన్నీ సంచులను అందుబాటులో ఉంచామ ని, ఎటువంటి కొరతలేదని స్పష్టం చేశారు. జిల్లా కలెక్ట ర్లు హమాలీలు, రవాణా సమస్యలపై ప్రత్యేక దృష్టి పె ట్టాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే ఫీడ్‌బ్యాక్ అందేలా వ్యవస్థ ఉండాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. రైతులకు చెల్లిం పులు వేగంగా జరిగేలా ట్యాబ్ ఎంట్రీలు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ యాసంగి సీజన్ లో భారీగా మొక్కజొన్న దిగుబడి వచ్చిందని, రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోళ్లు సజావుగా నిర్వహిం చాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం, మొక్కజొన్న తెలం గాణలోకి రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైన బందోబస్తు, విజిలెన్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. వర్షాల సూచనలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ కొనుగోళ్ల వేగాన్ని పెంచాలని అధికారులను ఆదే శించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, డీసీఎస్‌వో బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ కుమార్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, సంబంధిత అధి కారులు పాల్గొన్నారు.