రైతులు నష్టపోవద్దనే కొనుగోలు కేంద్రాలు
ABN , Publish Date - Oct 27 , 2026 | 11:54 PM
రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారు లకు అమ్ముకొని నష్టపోవద్దనే కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేసినట్లు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.
ఇల్లంతకుంట, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారు లకు అమ్ముకొని నష్టపోవద్దనే కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేసినట్లు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని వంతడుపుల, అనంతారం గ్రా మాల్లో మంగళవారం ఐకేపీ, ఫ్యాక్స్‌ల ఆధ్వర్యం లో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రా లను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు సన్నరకపు వడ్లను పండించిన రైతులకు బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిం చిందన్నారు. సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించి కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకరావాలని సూచించారు. మహిళలను కోటీశ్వరులను చేయ డంలో భాగంగా మహిళా సంఘాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ అప్పగించినట్లు తెలిపారు. నిర్వాహకులు నిబంధనలు పాటించా లని, రైతులను నష్టపర్చాలని చూస్తే ఊరుకునే దిలేదన్నారు. రైతులు ధాన్యాన్ని అమ్మిన 24గం టల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమచేయ డం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మండ ల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ వెంకటరమ ణారెడ్డి, ఏఎమ్‌సీ చైర్మన్ అంతగిరి సాహిత్యవినయ్ కుమార్, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మామిడి రాజు, సర్పంచ్‌లు మడ్కాడి లావ ణ్యరవి, వొల్లాల రజితవెంక టేశం, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తీగల పుష్ప లత, కట్ట సౌమ్య, యాస తిరుపతి, భరత్‌రెడ్డి, నాయకులు పసుల వెంకటి, మహేందర్‌రెడ్డి, ఆనందరెడ్డి, విజయ్, బడుగు లింగం, మంద బాల్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, ఉప్పల అమర్, సుధాక ర్‌రెడ్డి, రాజేశం, వామన్‌రెడ్డి, గడ్డమీది నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.