విజ్ఞతతో సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:46 PM
రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు పోరుబాట పట్టారని ప్రభుత్వం ఇప్పటికైనా విజ్ఞ తతో వ్యవహరించి సమస్యలను పరిష్కరించాల ని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అన్నారు.
సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు పోరుబాట పట్టారని ప్రభుత్వం ఇప్పటికైనా విజ్ఞ తతో వ్యవహరించి సమస్యలను పరిష్కరించాల ని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గుండమనేని మహేందర్‌రావు అధ్యక్షతన జిల్లా స్థాయి ముఖ్య నాయకులు సమావేశం జరిగింది. ఈ సందర్భం గా రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి మాట్లాడుతూ 2024 మార్చి నుంచి రిటైరైన 12వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన రిటె ౖర్మెంట్ బకాయిలు విడుదలచేయాలని డిమాండ్ చేశారు. ఏక మొత్తంలో రూ.10వేల కోట్లు కేటా యించాలని పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాల న్నారు. జీపీఎఫ్, సీపీఎస్ ఉపాధ్యాయుల డీఏ బకాయిలు విడుదల చేస్తూ బకాయి ఉన్న మరో నాలుగు వాయిదాల డీఏలను కూడా ప్రకటించా లన్నారు. హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్యం అందించాలని ఉపాధ్యాయుల సర్వీస్ నిబంధనా లను రూపిందించి పర్యవేక్షణ అధికారుల పదో న్నతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకట్ మాట్లాడుతూ సీసీ ఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరు ద్ధరించాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాతపెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశా రు. కేజీవీవీ, సమగ్ర శిక్ష ఉద్యోగులకు బేసిక్ పే ఇవ్వాలని, మోడల్ స్కూల్స్ గురుకులాల ఉద్యో గులకు 010 హెల్త్ కార్డులు అమలు చేయాలని అన్నారు. టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో మే 2న ఉద యం సిరిసిల్ల పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో యూటీ ఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షు డు, మాజీ ఎమ్మెల్సీ దా చూరి రామిరెడ్డి వర్ధంతి కార్యక్రమంతో పాటు టీ ఎస్‌యూటీఎఫ్ మూడో వార్షిక జనరల్ కౌన్సిల్ స మావేశం నిర్వహిస్తున్నామ న్నారు. ఉపాధ్యాయులు, పెన్షనర్లు, టీఎస్‌యూటీ ఎఫ్ నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కౌన్సిల్ సమావేశంలో విజయవంతం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగిటి రాజు, కోశాధికారి అంబటి రమేష్, కార్యదర్శులు కొత్వాల్ ప్రవీణ్, పాముల స్వామి, ఆడెపు శివ కుమార్, తిరుపతిజాదవ్, అరవింద్, ఉపాధ్యా యులు పాల్గొన్నారు.