Share News

సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ABN , Publish Date - Mar 24 , 2026 | 11:25 PM

ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలన్నింటిని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంకె రామచంద్రారెడ్డి, వేల్పుల బాలయ్య కోరారు. కలెక్టరేట్‌ ఎదుట టీపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.

సమస్యలను వెంటనే పరిష్కరించాలి
కలెక్టరేట్‌ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న టీపీటీఎఫ్‌ నాయకులు

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలన్నింటిని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంకె రామచంద్రారెడ్డి, వేల్పుల బాలయ్య కోరారు. కలెక్టరేట్‌ ఎదుట టీపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కౌన్సిలర్లు అర్కాల శ్రీనివాస్‌, జానకీదేవీ మాట్లాడుతూ విద్యారంగానికి 20 శాతం బడ్జెట్‌ తక్షణమే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. రిటైర్డ్‌ ఉపాధ్యాయుల పెన్షన్‌ ప్రయోజనాలను ఏక మొత్తంలో చెల్లించాలని, పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌ బిల్లులను, డీఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. విద్యాశాఖలో కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలని, కేజీబీవీ, మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులకు నగదు రహిత వైద్య సదుపాయాలను కల్పించాలని, సీపీఎస్‌ రద్దు చేసి కామన్‌ స్కూల్‌ విధానాన్ని అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్‌ కోట రామస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు మర్రి అవినాష్‌, పి శ్రీధర్‌, సీహెచ్‌ ఆంజనేయరావు, ఎన్‌ రామస్వామి, జిల్లా కార్యదర్శులు నాగుల శ్రీనివాస్‌, జి చంద్రమౌళి, కోడిగూటి తిరుపతి, కె రవీందర్‌, కరీంనగర్‌ టౌన్‌ అధ్యక్షుడు పి హరికృష్ణ, కొండపాక తిరుపతి, ఉపాధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి, పూర్వ ప్రధాన కార్యదర్శి రాగల చంద్రశేఖర్‌, సీనియర్‌ ఉపాధ్యాయ, ఉద్యమ నాయకులు కోల రాజమల్లు, నేదునూరి కనుకయ్య, ఎన్‌ బాలయ్య, మేడి చంద్రయ్య, సిహెచ్‌. సత్యం, కుమారస్వామి పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2026 | 11:25 PM