Share News

సమస్యలు త్వరగా పరిష్కరించాలి

ABN , Publish Date - Jun 28 , 2026 | 12:17 AM

క్షేత్రస్ధాయిలో ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తూ, గ్రామాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సీపీ గౌస్‌ఆలం అధికారులను ఆదేశించారు.

సమస్యలు త్వరగా పరిష్కరించాలి

తిమ్మాపూర్‌, జూన్‌ 27 (ఆంద్రజ్యోతి): క్షేత్రస్ధాయిలో ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తూ, గ్రామాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సీపీ గౌస్‌ఆలం అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం సిపి గౌస్‌ అలం తిమ్మాపూర్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఆయనకు కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ విజయ్‌కుమార్‌, తిమ్మాపూర్‌ సీఐ పర్శ రమేష్‌ స్వాగతం పలికారు. అనంతరం పోలీస్‌ గార్డ్స్‌ నుంచి సీపీ గౌరవ వందనం స్వీకరించారు. స్టేషన్‌ రికార్డులు, పెండింగ్‌లో ఉన్న క్రిమినల్‌ కేసులు, వాటి తర్యాప్తు పురోగతిని సమీక్షించారు. తిమ్మాపూర్‌ సర్కిల్‌ పరిధిలోకి వచ్చే తిమ్మాపూర్‌, ఎల్‌ఎండి కాలనీ, చిగురుమామిడి స్టేషన్ల పనితీరుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం సీపీ గౌస్‌ ఆలం విలేకరులతో మాట్లాడుతూ పోలీస్‌ శాఖలో పరిపాలన దక్షత, పారదర్శకతను పెంపొందించేందుకు ఈ తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుతం సర్కిల్‌ పరిధిలోని అన్ని రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉందని, కేసుల దర్యాప్తు పురోగతి సంతృప్తికరంగా ఉందన్నారు. సీఐ బొల్లం రమేష్‌ సర్కిల్‌ పరిధిలోని గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటుడాన్ని సీపీ అభినందించారు. కార్యక్రమంలో రూరల్‌ ఏసీపీ విజయ్‌ కుమార్‌, తిమ్మాపూర్‌ ఇన్‌స్పేక్టర్‌ బొల్లం రమేష్‌, ఎల్‌ఎండి ఎస్సై సయ్యద్‌ అన్వర్‌, గన్నేరువరం ఎస్సై నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 28 , 2026 | 12:17 AM