Share News

తాగునీటి సరఫరాకు ముందస్తు చర్యలు

ABN , Publish Date - Oct 31 , 2026 | 12:00 AM

ఎల్‌నినో ప్రభా వం నేపథ్యంలో రాబోయే వేసవి కాలం ముగిసే వరకూ జిల్లాలో తాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా ముంద స్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశిం చారు.

తాగునీటి సరఫరాకు ముందస్తు చర్యలు

సిరిసిల్ల, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : ఎల్‌నినో ప్రభా వం నేపథ్యంలో రాబోయే వేసవి కాలం ముగిసే వరకూ జిల్లాలో తాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా ముంద స్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశిం చారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వేసవి కాల సన్నద్ధత, తాగునీటి సరఫరాకు చేపట్టాల్సిన చర్యలపై మిషన్‌ భగీ రథ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భం గా కలెక్టర్‌ మాట్లాడుతూ అగ్రహారం, రుద్రవరం పంప్‌ హౌస్‌లలోని పంపుసెట్లను ఎప్పుడూ సిద్ధంగా ఉంచాల ని, ఇంకా కావాల్సిన యంత్రాలు అందుబాటులో ఉండే లా చూసుకోవాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తుగా ఏర్పాట్లు చే యాలని సూచించారు. ఈ సమావేశంలో మిషన్‌ భగీ రథ ఎస్‌ఈ రాములు, ఈఈలు ముజాహిద్‌ అన్వర్‌, సుమలత, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు రాము, విశ్వ న్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రణాళిక ప్రకారం ఆసుపత్రుల నిర్మాణాలను పూర్తి చేయాలి

సిరిసిల్ల అర్బన్‌ : జిల్లాలో నూతనంగా నిర్మించే అసుపత్రులను ప్రణాళికల ప్రకారం పూర్తి చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం పంచాయతీరాజ్‌ శాఖ, టీజీఎంఐ డీసీ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో 15వ ఆర్థిక సం ఘం నిధులతో జిల్లాలో ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌ సెంటర్ల నిర్మాణాలు, జీజీహెచ్‌, ఏరియా ఆసుపత్రి, సీహెచ్‌సీల్లో వసతుల కల్పినలపై కలెక్టర్‌ సమీక్షించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో పంచాయతీరాజ్‌ ఇంజనీ రింగ్‌ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 16 సబ్‌ హెల్త్‌ సెంటర్ల నిర్మాణ పనులు చేపట్టారని, ఇప్పటికే 7 పూర్తి అయ్యాయని, మిగతా పనులు పురోగతిలో ఉన్నాయని, రుద్రంగి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని అధికారులు కలెక్టర్‌ కు వివరించారు. టీజీఎంఐడీసీ ఆధ్వర్యంలో ఇల్లంతకంట మండల కేంద్రంలో సీహెచ్‌సీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వివ రించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో ఆసుపత్రుల భవన నిర్మాణ పను లు ప్రణాళిక ప్రకారం శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. తుది దశలో ఉన్న పనులను ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణం గా అన్ని వసతులలో పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌, వేములవాడ ఏరియా ఆసుపత్రి, ఎల్లారెడ్డిపేట, గంభీరా వుపేట సీహెచ్‌సీల్లో కావాల్సిన వైద్యయంత్ర పరికరాలు, సామగ్రి అభివృద్ధి పనులను త్వరగా చేపట్టి పూర్తిచే యించాలన్నారు. ఇల్లంతకుంట సీహెచ్‌సీ నిర్మాణ పను లను గడువులోగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురా వాలన్నారు. సమావేశంలో జిల్లా వైధ్యాధికారి ఏంజెలా ఆల్ర్ఫెడ్‌, పంచాయతీరాజ్‌ ఈఈ సుదర్శన్‌రెడ్డి, వైద్యకళా శాల ప్రిన్సిపాల్‌ రాజేశ్వరీ, వేములవాడ ఏరియా ఆసుప త్రి సూపరింటెండెంట్‌ సుభాషిణి పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2026 | 12:00 AM