Share News

పిల్లల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి

ABN , Publish Date - Oct 09 , 2026 | 12:11 AM

పిల్లల ఆల్‌రౌండ్‌ డెవలప్‌ మెంట్‌ కోసం శారీరక, మానసిక, సామాజిక భావోద్వేగ అభివృద్ధికి సమా న ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం అన్నారు.

పిల్లల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి

సిరిసిల్ల టౌన్‌, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి) : పిల్లల ఆల్‌రౌండ్‌ డెవలప్‌ మెంట్‌ కోసం శారీరక, మానసిక, సామాజిక భావోద్వేగ అభివృద్ధికి సమా న ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం అన్నారు. గురువారం పట్టణంలోని కల్యాణలక్ష్మి గార్డెన్‌లో జిల్లాస్థాయి పోషణ మేళా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీరాజం మాట్లాడు తూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు అందుతున్న సేవలను సమ ర్థవంతగా వినియోగించుకోవాలన్నారు. వివిధ శాఖల మధ్య సమన్వ యంతో పిల్లలు, గర్భిణులు, బాలింతలు, మహిళల పోషకాహారం, ఆరో గ్యం, శిశు సంరక్షణ, సమగ్ర అభివృద్ధిపై అవగాహన కల్పించడమే లక్ష్యం గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిచామన్నారు. సీడీపీవో సబిత మాట్లాడుతూ చిన్నారుల శారీరక, మానసిక ఆరోగ్యానికి జీవితంలో వేయి రోజులు అ త్యంత కీలకమైనవన్నారు. గర్భధారణ దశ నుంచి శిశువు తొలి రెండు సంవత్సరాల వరకు సరైన పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, తల్లిపాలు, అవసరమైన వైద్య సేవలను అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మరో ముఖ్యఅతిథి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్ర పాణి మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యం, పోషణ, విద్యాభివృద్ధికి అంగన్‌ వాడీ కేంద్రాలు కీలకమన్నారు. మహిళలకు పోషకాహారం ప్రాముఖ్యత తెలియజేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 9 నుంచి అక్టోబరు 8 వరకు పోషణ మాసం కార్యక్రమాలను నిర్వహించిందన్నారు. అనంత రం పోషకాహా రంపై అవగాహన కల్పించారు. గర్భిణులకు సామూహిక సీమంతాలను నిర్వహించి ఆశీర్వదించారు. కార్యక్రమంలో వేములవాడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాజు, సీడీపీవో లు, కౌన్సిలర్లు అంగన్‌వాడీ టీచర్లు, ఆర్పీలు, ఆశా వర్కర్లు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Oct 09 , 2026 | 12:11 AM