Share News

మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం

ABN , Publish Date - Aug 21 , 2026 | 12:28 AM

మహిళల ఆరోగ్య పరిరక్షణ కు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తెలిపారు.

మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం

బోయినిపల్లి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి) : మహిళల ఆరోగ్య పరిరక్షణ కు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తెలిపారు. మహిళా సంఘాల సభ్యుల ఆరోగ్య పరిస్థితిని ముందుగానే గుర్తించి, అవసరమైన వైద్య సేవలు అందించేందుకు 30రకాల ఆరోగ్య పరీక్షలతో ప్రత్యేక స్ర్కీనింగ్‌ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. బోయినిపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహి ళా సంఘాల సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని గురువారం కలెక్టర్‌ మహిళా సంఘాల సభ్యులతో కలిసి ప్రా రంభించారు. ఆరోగ్య పరీక్షల నిర్వహణతీరును పరిశీలించి, వైద్య సిబ్బం దికి పలు సూచనలు చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళలు కుటుం బంలో ఎన్నో బాధ్యతలను నిర్వర్తిస్తూ పిల్లల ఆరోగ్యం, కుటుంబ అవస రాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారని, అయితే తమ ఆరోగ్యం విషయంలో మాత్రం చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తుంటారన్నారు. మహిళా సంఘాల సభ్యులందరికీ 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. పరీక్షల ద్వారా మహిళల్లో దాగి ఉన్న ఆరోగ్య సమస్య లను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుందని, అవసరమైన వారికి సకాలంలో వైద్యం అందించేందుకు వీలవుతుందని వివరించారు.

ఐదు మండలాల్లో తొలి దశ స్ర్కీనింగ్‌...

మొదటి దశలో జిల్లాలోని బోయినపల్లి, వేములవాడ, వీర్నపల్లి, కోనరావుపేట, తంగళ్లపల్లి మండలాల్లో మహిళా సంఘాల సభ్యులకు ఆరోగ్య స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. బోయినపల్లి మండలంలో కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. జిల్లా లోని మిగతా నాలుగు మండలాల్లో శుక్రవారం నుంచి పరీక్షలు ప్రారం భమవుతాయన్నారు. బోయినపల్లి మండలంలో 31 విలేజ్‌ ఆర్గనైజేషన్ల పరిధిలో 819 స్వయం సహాయక సంఘాల్లో మొత్తం 9424 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాఖ్య అఽద్యక్షురాలు భాగ్య, జిల్లా గ్రామీణాభీవృధ్ది శాఖ అధికారి లక్ష్మినారాయణ, వైద్యారోగ్య శాఖ అధికారిణి ఏంజెలా అల్ర్ఫెడ్‌ ,సర్పంచ్‌ మోహన్‌, మండల ప్రత్యేక అధికారి శరత్‌, తహాశీల్దార్‌ షరీపుధ్దీన్‌ ,వైద్యులు, మహిళా సంఘాల సభ్యులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

సన్న బియ్యం పంపిణీ పారదర్శకంగా చేపట్టాలి

రేషన్‌ కార్డు లబ్ధిదారులకు నిబంధనల మేరకు సన్న బియ్యాన్ని పార దర్శకంగా పంపిణీ చేయాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని రేషన్‌షాపును గురువారం తనిఖీ చేశారు. లబ్ధిదారులకు మూడు నెలలకు సంబంధించిన సన్నబియ్యం పంపిణీ జరుగుతున్న తీరును పరిశీలించా రు. పంపిణీలో అవకతవకలకు తావులేకుండా అర్హులైన ప్రతి లబ్ధిదారు డికి సక్రమంగా బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ షరీఫుద్దీన్‌తో సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2026 | 12:28 AM