రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమివ్వాలి
ABN , Publish Date - Aug 15 , 2026 | 12:49 AM
రైతుల సంక్షే మానికి సహకార సంఘ పాలకవర్గం ప్రాధాన్యం ఇవ్వాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు.
ఇల్లంతకుంట, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి) : రైతుల సంక్షే మానికి సహకార సంఘ పాలకవర్గం ప్రాధాన్యం ఇవ్వాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. మండల కేంద్రంలోని శ్రీరాజరాజేశ్వర కళ్యాణ మండపంలో శుక్రవారం సహకార సంఘ అధ్యక్షుడుగా వెంకటరమణారెడ్డితో పాటు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్య క్రమం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘ పాలకవర్గానికి గతంలో ఎన్నికలు జరిగా యని, అనేకమంది పోటీచేసి అప్పులపాలయ్యారని అన్నారు. అందువల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం డైరెక్టర్ల సంఖ్యను పెంచి రైతులకు చేరువగా ఉండేలా చూస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో రైతాంగ ప్రభుత్వం కొనసాగుతుందని, రైతులకు పెట్టుబడి సాయంతో పాటు సకాలంలో ఎరువులు అందిం చామని అన్నారు. భూభారతి ద్వారా భూసమస్యల పరి ష్కారం కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు తీసు కున్న రుణాలు సకాలంలో చెల్లిస్తేనే సంఘూలు అభివృద్ధి చెందుతాయన్నారు. కాంగ్రెస్‌పార్టీ అభివృద్ధి కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. అనంతరం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. సమావేశంలో ఫ్యాక్స్ అధ్యక్షుడు ఉట్కూరి వెంకటరమణారెడ్డి, వైస్‌చైర్మన్ యాస తిరుపతి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఇల్లంతకుంట సర్పంచ్ మామిడి రాజు, మాజీ ఫ్యాక్స్‌చైర్మన్ ఐరెడ్డి మహేందర్‌రెడ్డి, సీఈవో చిట్టి రవీందర్ రెడ్డి, డైరెక్టర్లు కేతిరెడ్డి నవీన్‌రెడ్డి, గుండ వెంకటేశం, ఒగ్గు రమేష్, ఏలేటి మాధవరెడ్డి, సొల్లు కవిత, సింగిరెడ్డి లక్ష్మి, కోనేటి నర్సయ్య, ముక్కీస ఎల్లా రెడ్డి, ఎలుక అనీల్‌కుమార్, జాప బాల్‌రెడ్డి, ఉప్పుల సంజీవరెడ్డిల తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు, సిబ్బం ది పాల్గొన్నారు.
ద్విచక్ర వాహన ర్యాలీ
సహకార సంఘపాలకవర్గ ప్రమాణ స్వీకారం సందర్భంగా మండలంలోని తాళ్ళల్లపల్లె గ్రామం నుంచి రేపాక, సోమారంపేట, వెంకట్రావుపల్లె గ్రామాల మీదుగా ద్విచక్ర వాహన ర్యాలీ ఇల్లంతకుంటకు చేరుకుంది. ఈసందర్భంగా మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. మండలకేంద్రంలో వివేకానంద, మహాత్మాగాంధీ, ఇందిరాగాందీ విగ్రహాలకు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పూలమాలలు వేశారు. టపాసులు కాల్చుతు, డప్పుచపుల్ల మద్య కాంగ్రెస్‌పార్టీ నాయకుల ర్యాలీ కొనసాగింది. సహకార సంఘ పాలకవర్గ సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు.