ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
ABN , Publish Date - Jul 21 , 2026 | 11:50 PM
ప్రజల భద్రత కు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ మహేష్ బి గితే అన్నారు.
తంగళ్లపల్లి, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ప్రజల భద్రత కు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. మంగళవారం తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ ను ఎస్పీ తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ రికా ర్డుల నిర్వహణ, సిబ్బంది హజరు, పెట్రోలింగ్ నిర్వహణ, రౌడి షీటర్లు, పాత నేరస్తులపై నిఘా తదితర అంశా లపై క్షుణ్ణంగా సమీక్షించి ప్రజలకు అందిస్తున్న పోలీసు సేవలపై ఆరా తీశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లా డుతూ బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రతి అధి కారి బాధ్యతగా పనిచేయాలని అన్నారు. వివిధ సమస్య లతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల ఫిర్యాదులను అధికారులు బాధ్యతగా చట్ట పరిధిలో పరిష్కరించాలని సూచించారు. సీసీటీఎన్‌ఎస్ 2.0 వ్యస్థను సమర్థవంతం గా వినియోగించి పోలీసు సేవలను మరింత వేగవంతం గా, పారదర్శకంగా అందించాలని తెలిపారు. స్టేషన్ పరి ధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ అధికారులు, సి బ్బంది గ్రామాలను తరచూ సందర్శిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీ సింగ్‌ను మరింత సమర్థవంతంగా అమ లు చేయాలని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొం దించేలా సేవలు అందించాలని విధు లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపర మైన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. ఎస్పీ వెంట డీఎస్పీ నాగేంద్ర చారి, సీఐ నాగేశ్వరరావు, ఎస్‌ఐలు ఉపేంద్రచారి, మల్లేఽష్ సిబ్బంది ఉన్నారు.