Share News

మహిళా సంఘాల భవనాలకు ప్రాధాన్యం

ABN , Publish Date - Feb 19 , 2026 | 12:28 AM

మహిళా సంఘాల భవనాలకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పిస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని తాట్లవాయి, దావనపెల్లి గ్రామాల్లో రూ.10 లక్షల చొప్పున నిధులతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే బుధవారం శంకుస్థాపన చేశారు.

మహిళా సంఘాల భవనాలకు ప్రాధాన్యం
జగిత్యాలలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

రాయికల్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): మహిళా సంఘాల భవనాలకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పిస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని తాట్లవాయి, దావనపెల్లి గ్రామాల్లో రూ.10 లక్షల చొప్పున నిధులతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నూతన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రేవంతరెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. మహిళలు ఆత్మ గౌరవంగా ఉండాలని మహిళా సంఘాల భవనాలకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించిందన్నారు. నిరుపేదలకు సొంతింటి కల సాకారం కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేసిందన్నారు. అందరికీ ఉచిత వ్యవసాయ విద్యుత అందిస్తున్న కాంగ్రెస్‌ నేడు 200 యూనిట్ల ఉచిత కరెంట్‌ ఇళ్లకు అందిస్తోందన్నారు. గ్రామాల్లో పంటల సాగు పెరిగిందని, ప్రభుత్వమే అన్ని చేయలేదు కాబట్టి శివారు గ్రామాల రైతులు సైతం ఓవైపు కాలువలో పొదలను, పూడికను తొలగించుకోవాలని, అప్పుడు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతుందన్నారు. రైతులకు అండగా రాష్ట్ర ప్రబుత్వం ఉందన్నారు. సన్న వడ్లకు బోనస్‌ విడుదల చేసిందని, మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో సర్పంచులు మాలావత ప్రసాద్‌, ఆకుల మల్లేశం, ఉప సర్పంచులు బానావత రవి, మారుపాక నారాయణ, తహసీల్దార్‌ నాగార్జున, ఎంపీవో సుష్మా, మాజీ జడ్పీటీసీ అశ్విని, మాజీఎంపీపీ లావుడ్య సంధ్యారాణిసురేందర్‌ నాయక్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు రవీందర్‌రావు, కోల శ్రీనివాస్‌, మాజీ పీఏసీఎస్‌ చైర్మన ఏనుగు మల్లారెడ్డి, రాయికల్‌ మున్సిపల్‌ చైర్మన కట్కం రవి, వైస్‌చైర్మన సౌజన్యశ్రీధర్‌ రెడ్డి పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధికి సర్పంచలు చిత్తశుద్ధితో పనిచేయాలి

జగిత్యాల అర్బన: సర్పంచలు చిత్తశుద్ధితో గ్రామాల అభివృద్ధికి కృషిచేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. బుధవారం జగిత్యాల అర్బన కాలనీలోని న్యాక్‌ శిక్షణ కేంద్రంలో ఐదు రోజుల పాటు జరిగే నియోజకవర్గ సర్పంచల శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. సర్పంచలు నేటి సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, తద్వారా గ్రామాల్లో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన వస్తుందన్నారు. డంపింగ్‌ యార్డు ను ఉపయోగించి తడి, పొడి చెత్తతో ఎరువుల తయారీ విధానం చేపట్టాలన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బందికి సాంకేతిక శిక్షణ ఎలక్ర్టికల్‌, ప్లంబింగ్‌ సర్టిఫికెట్‌లు వచ్చేలా న్యాక్‌లో శిక్షణ ఇవ్వాలన్నారు. గ్రామాల్లో ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని దాని వల్ల ప్రజల్లో గుర్తింపు లభిస్తుందన్నారు. కార్యక్ర మంలో జిల్లా పంచాయతీ అధికారి మదనమోహన, ఎంపీడీవో చిరంజీవి, న్యాక్‌ అసిస్టెంట్‌ రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 19 , 2026 | 12:28 AM