Share News

‘ప్రజావాణి’ దరఖాస్తులకు ప్రాధాన్యం

ABN , Publish Date - Mar 10 , 2026 | 12:13 AM

ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యమిచ్చి, శాఖల వారీగా వాటిని సమీక్షించి పరిష్కరిస్తామని కలెక్టర్‌ చిత్రామిశ్రా అన్నారు.

‘ప్రజావాణి’ దరఖాస్తులకు ప్రాధాన్యం
దివ్యాంగుల వద్దకు వెళ్లి వినతిపత్రం స్వీకరిస్తున్న కలెక్టర్‌ చిత్రా మిశ్రా

కరీంనగర్‌, మార్చి 9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యమిచ్చి, శాఖల వారీగా వాటిని సమీక్షించి పరిష్కరిస్తామని కలెక్టర్‌ చిత్రామిశ్రా అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వాటిని సంబంధిత అధికారులు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రతి దరఖాస్తుపై విచారించి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. శాఖలవారీగా పెండింగ్‌ దరఖాస్తులను సమీక్షిస్తానన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి 352 దరఖాస్తులు వచ్చాయన్నారు. వృద్దులు, దివ్యాంగులు కూర్చున్న చోటికే కలెక్టర్‌ వెళ్లి దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ లక్ష్మీకిరణ్‌, ఆర్డీవో మహేశ్వర్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 10 , 2026 | 12:13 AM