అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం
ABN , Publish Date - Nov 10 , 2026 | 12:19 AM
అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తోందని ఏఎంసీ చైర్మన్ దేవానం దం, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజక వర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌లు అన్నా రు.
ఎల్లారెడ్డిపేట, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తోందని ఏఎంసీ చైర్మన్ దేవానం దం, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజక వర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌లు అన్నా రు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్ గ్రా మంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో రూ.56 లక్షల నిధులతో తలపెట్టిన వంటశాల, వసతి భవన నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆదివారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పోరేటుకు దీటుగా ఆధునిక వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందిస్తోందన్నారు. నియోజకవర్గంలోని నాలుగు కేజీబీవీలకు రూ.56 లక్ష ల చొప్పున వంటశాల, వసతి భవన నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. గ్రామంలో రూ.30లక్షల వీబీజీ రామ్‌జీ నిధు లతో సీసీ రహదారుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టామన్నారు. కిష్టునాయక్‌తండాలో సీసీ రోడ్డు నిర్మాణానికి సర్పంచ్ నిర్మల భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నర్సయ్య, సర్పంచులు వెంకట్‌రెడ్డి, బాపురెడ్డి, కిషన్, నాగరాజు, పాఠశాల ప్రత్యేక అధికారి అజంత, నాయకులు కిషన్, రవీందర్, బాల్‌రెడ్డి, విజయ్‌రెడ్డి, శ్రీనివాస్, రాం రెడ్డి, లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, పవన్, రాజయ్య, బా లయ్య, రాజునాయక్, రాములు, అరుణ, రాజేం దర్, బుజ్జి, రమేశ్‌నాయక్ పాల్గొన్నారు.