అట్టడుగు వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యం
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:33 AM
అట్టడుగువర్గాల ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.
ఇల్లంతకుంట, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి) : అట్టడుగువర్గాల ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని ముస్కానిపేట, ఇల్లంతకుంట, అనంతగిరి గ్రామాలలో ఆదివారం అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రేషన్‌కా ర్డులు సైతం ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షే మ పథకాలు అమలు చేయడమే కాకుండా అభివృద్ధి పనులు చేస్తూ ఆద ర్శంగా నిలుస్తున్నామని అన్నారు. 22ఏపై రాద్ధాంతం చేసిన బీఆర్‌ఎస్ నాయకులు, వారి భూఆక్రమణలు బయటకు రావడంతో నోరుమెదపడం లేదన్నారు. కేసీఆర్ ఆక్రమించిన భూములను పేదప్రజలకు పంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడమే కాకుండా వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపా రు. మహిళలు అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. ఇల్లంత కుంట బస్టాండ్ ప్రాంతంలో వర్షం పడినప్పుడు ఇబ్బంది అవుతుందని గుర్తించి డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మామిడి రాజు, ఫ్యాక్స్‌చైర్మన్ వెంకటరమణా రెడ్డి, అనంతగిరి సర్పంచ్ అరుకాల నవీన్‌కుమార్, వైస్‌చైర్మన్ యాస తిరు పతి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కట్ట సౌమ్య, మహిళా కాంగ్రెస్ అధ్యక్షు రాలు తీగల పుష్పలత, పోచమ్మ దేవస్థాన చైర్మన్ అంతగిరి, నాయకులు మహేందర్‌రెడ్డి, ఆనందరెడ్డి, అంతగిరి వినయ్‌కుమార్, పసుల వెంకటి, బొల్లవేని రమేష్, ఎలుక రామస్వామి, భారతమ్మ, నేరెళ్ళ విజయ్, గుండ వెంకటేశం, భాస్కర్‌రెడ్డి, మాధవరెడ్డి, మల్లేశం, నాగరాజుశర్మ, తిప్పరవేని బాలకిషన్, ఒగ్గు రమేష్, బాల్‌రెడ్డి, బిగుళ్ళ విజయ్, వెంకటరాంరెడ్డి, వెంక టేశం, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
అన్నపూర్ణ రిజర్వాయర్ పరిశీలన
మండలంలోని అనంతగిరి గ్రామ సమీపంలోని అన్నపూర్ణ రిజర్వాయర్ ను ఎమ్మెల్యే సత్యనారాయణ పరిశీలించారు. మధ్య మానేరు ద్వారా వస్తు న్న నీటిని అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి మోటార్ల నీటిని ఎత్తిపోస్తుండగా ఎంత నీరు విడుదల అవుతుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముస్కానిపేట గ్రామంలో ఉత్తమ ఉపాధ్యాయుడు సందీప్‌రెడ్డి, కవి తుని కి తిరుపతి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కట్ట సౌమ్యను సన్మానించారు. ఇల్లంతకుంటలో గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందించారు. అనంతగిరి గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహా న్ని ఆవిష్కరించారు.