Share News

సంక్షేమ పథకాల్లో నిరుపేదలకు ప్రాధాన్యం

ABN , Publish Date - Nov 19 , 2026 | 12:15 AM

సంక్షేమ పథకాల అమలులో నిరుపేదలకు ప్రాధాన్యమిస్తున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

సంక్షేమ పథకాల్లో నిరుపేదలకు ప్రాధాన్యం
సైదాపూర్‌లో పింఛన్‌ మంజూరు పత్రాన్ని అందజేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌

సైదాపూర్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): సంక్షేమ పథకాల అమలులో నిరుపేదలకు ప్రాధాన్యమిస్తున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సైదాపూర్‌లో 642మంది లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను ఆయన బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హత ఉండి పింఛన్లు పొందని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. త్వరలో వృద్ధాప్య పింఛన్లు కూడా మంజూరవుతాయన్నారు. కరువు నివారణ, భూగర్భ జలాల పెంపునకు జలసిరి కార్యక్రమాన్ని అమలు చేయాలన్నారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు, వ్యవసాయ పొలాల్లో ఫామ్‌ పాండ్స్‌ నిర్మించుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో నాలుగు నుంచి ఐదు ఊటకుంటలు నిర్మించాలన్నారు. నిర్లక్ష్యం వహించే గ్రామాలకు ఇతర అభివృద్ధి నిధులు నిలిపివేస్తామని హెచ్చరించారు. సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించనున్నారన్నారు. మండలంలోని ఆకునూర్‌ గ్రామాన్ని సైదాపూర్‌ సహకార సంఘం నుంచి విభజించి నూతన సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దొంత సుధాకర్‌, సింగిల్‌ విండో చైర్మన్లు కొత్త తిరుపతిరెడ్డి, పంతంగి రవీందర్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు చాడ కొండాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గుండారపు శ్రీనివాస్‌, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు జున్నోతుల రాజేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాయిశెట్టి చంద్రయ్య, ఆర్డీవో జల కుమారి, తహసీల్దార్‌ గుర్రం శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2026 | 12:15 AM