కులగణన పేరిట ప్రధాని మోసం..
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:05 AM
దేశ వ్యాప్తంగా జనగణ నతో పాటు కులగణన చేస్తామని బీసీ అంశాన్ని చేరుస్తామని ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్రమోది మోసం చేశాడని బీసీ సంక్షేమ శాఖ, రవా ణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : దేశ వ్యాప్తంగా జనగణ నతో పాటు కులగణన చేస్తామని బీసీ అంశాన్ని చేరుస్తామని ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్రమోది మోసం చేశాడని బీసీ సంక్షేమ శాఖ, రవా ణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో పెద్దమ్మ తల్లి ముదిరాజ్ సంక్షేమ సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు చొక్కాల రాము అధ్యక్షతన ముదిరాజ్ సింహగర్జన బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, శాసన మండలి వైస్‌చైర్మన్ బండ ప్రకాష్, ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హక్కుల కోసం గట్టిగా మాట్లాడే శక్తి ఉండాలని, ఎక్కడ సమస్య కనిపించినా అక్కడ ధైర్యంగా గొంతు విని పించాలన్నారు. మూడు దశాబ్ధాలుగా బీసీ సమాజం కోసం పని చేస్తున్న అనేక మంది నాయకులతో తనకు సంబంధం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ లో ఉండి కూడా బీసీ సమాజం సమస్యల పరిష్కారం కోసం కృషి చేయ డం బాధ్యతగా భావిస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయక త్వంలో బీసీలను సంబంధించిన అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారి స్తుందన్నారు. ముదిరాజ్‌లను ఏ/1లో చేర్చడం కావాలా, మంత్రి పదవి కావాలా.. అని ముఖ్యమంత్రి అడిగితే ముందు ముదిరాజ్‌ల ను ఏ/1లో చేర్చాలని అడిగే ధైర్యం తనకుందని క్రీడలు, యువజన సర్వీ సుల శాఖ మంత్రి వాకిటి శీహరి అన్నారు. రాష్ట్రంలో సంఖ్య పరంగా ముది రాజ్‌లు ఎక్కువగా ఉన్నారని, అయినా ఎమ్మెల్యేలం ఎందుకు కావడం లేదో ఆలోచ న చేయాలన్నారు. ముదిరాజ్‌లను బీసీ ఏ/1లో ఉన్న ఇతర కులాల వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బీసీ డీ నుంచి బీసీ ఏ/1లోకి చేర్చ డంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాను కూలంగా ఉందన్నారు. ఈనెల 30న సిరిసిల్లలో జరిగే బహిరంగ సభలో ముదిరాజ్‌లను ఒక ఎజెండాగా చేర్చాలని శాసన మండలి వైస్‌చైర్మన్ బండ ప్రకాష్ అన్నారు. 242 బీసీ కులాలుంటే 180 కులాల కంటే ముదిరాజ్‌లు తక్కువ స్థాయిలో ఉన్నట్లు సర్వేలో తేలింద న్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒకసారి సమీక్షించా లని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కో-ఆప రేటివ్ సొసైటీ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్, జిల్లా ఫిషరీష్ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ చొప్పరి రాంచంద్రం, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్య క్షుడు సంగీతం శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేం దర్‌రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్షహన్మాండ్లు, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సరుగు నరేష్, ఉపాధ్యక్షులు దేవేందర్, దేవరాజు, రాజ్‌కుమార్, శేఖర్‌బాబు, చంద్రశేఖర్, కోడి అంతయ్య, పిట్టల భూమేష్, సరుగు నరేష్, రెడ్డబోయిన గోపి తదితరులు పాల్గొన్నారు.