ఘనంగా ప్రధాని జన్మదిన వేడుకలు
ABN , Publish Date - Sep 18 , 2026 | 01:08 AM
జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాల యంలో గురువారం ప్రధాని జన్మదిన వేడుక లు నిర్వహించారు.
సిరిసిల్ల అర్బన్, సెప్టెంబరు 17 (ఆంధ్ర జ్యోతి) : జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాల యంలో గురువారం ప్రధాని జన్మదిన వేడుక లు నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపీతోపాటు 76మంది రక్తదానం చేశారు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శులు పోన్నాల తిరుపతిరెడ్డి, సిరికొండ శ్రీనివాస్, జిల్లా ఉపా ధ్యక్షులు శీలం రాజు, బర్కం వెంకటలక్ష్మీ, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ మెరుగు శ్రీనివాస్, కౌన్సిలర్‌లు మెరగు మంజుల శ్రీనివాస్, మామిడాల మహేష్, బాలకిషన్, వంతడుప్పుల సుధాకర్, రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేట : మండలంలో బీజేపీ నాయకులు వేడుకలు నిర్వహించారు. మండల కేం ద్రంలోని వృద్ధుల డే కేర్ సెంటర్‌లోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. రామచంద్రారెడ్డి, బుగ్గారెడ్డి, లక్ష్మారెడ్డి, జితేందర్‌రెడ్డి, కృష్ణహరి, కిరణ్‌నాయక్, శరత్‌రెడ్డి, రంజిత్‌కుమా ర్, పాల్గొన్నారు.
ఇల్లంతకుంట : బీజేపీ మండలశాఖ అధ్య క్షుడు భూమల్ల అనీల్‌కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సాయగౌడ్, స్వామి, సంతోష్, హరీష్, మల్లేశం, సంపత్, కమలాక ర్‌రావు, పర్శరాం తదితరులు పాల్గొన్నారు.
వేములవాడ : వేములవాడ పట్టణంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామ కృష్ణ ఆధ్వర్యంలో భీమేశ్వర స్వామి ఆలయం లో పూజలు నిర్వహించి కోడెమొక్కులు చెల్లిం చారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్, నాయకులు రేగుల మల్లికార్జున్, వంగల శ్రీని వాస్, అక్కనపల్లి వివేక్‌రెడ్డి, పిన్నింటి హన్మాం డ్లు ఉన్నారు. వేములవాడ అర్బన్ మండల అధ్యక్షుడు బుర్ర శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో సంబరాలు జరు పుకున్నారు. ఎర్రం మహేష్ తదిత రులు ఉన్నారు.
గంభీరావుపేట : మండలంలో వేడుకలను నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు కోడె రమేష్, ప్రధాన కార్యదర్శి మల్లేశ్‌యాదవ్, నాయకులు దేవేందర్ యాదవ్, సర్వోత్తమ్ తదితరులు ఉన్నారు.
కోనరావుపేట : మండలంలోని మరిమడ్ల లో వేడుకలను నిర్వహించారు. మాజీ ఎంపీటీ సీ కోనేటి రేణుక, కుమ్మరి దిలీప్, పుల్కం మ ల్లేశం, శ్రీగాద రేణుక పాల్గొన్నారు.
చందుర్తి : మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో వేడుకలు నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు మొక్కలే విజయేందర్, సెస్ మాజీ చైర్మన్ అల్లాడి రమేష్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మార్త సత్తయ్య, పెరుక గంగారాజు, మోత్కుపల్లి రాజశేఖర్, చింతకుంట సాగర్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.