Share News

పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించాలి..

ABN , Publish Date - Jun 11 , 2026 | 12:28 AM

పెట్రో ఉత్పత్తుల ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు.

పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించాలి..

సుభాష్‌నగర్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): పెట్రో ఉత్పత్తుల ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. గ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ సీపీఐ ఆద్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడికి బుదవారం యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు నాయకులకు మఽధ్య తోపులాట జరిగింది. ధర్నా అనంతరం చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలపై పెనుభారం మోపుతోందన్నారు. వంటగ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపుతో నిత్యావసర ధరలు కూడా పెరుగుతాయని తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం నీరుగారి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలపై సీపీఐ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తూ, దేశ వ్యాప్తంగా ఆగస్టులో యాత్రలు చేపడుతుందని, సెప్టెంబరులో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు పొనగంటి కేదారి, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్‌కుమార్‌, బోయిని అశోక్‌, గూడెం లక్ష్మీ, టేకుమల్ల సమ్మయ్య, బోయిని తిరుపతి, పిట్టల సమ్మయ్య, న్యాలపట్ల రాజు, కౌన్సిల్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2026 | 12:28 AM