Share News

ధరాఘాతం..

ABN , Publish Date - Apr 03 , 2026 | 01:06 AM

ఇరాన్‌-ఇజ్రాయిల్‌, అమెరికా దేశాల మధ్య జరుగు తున్న యుద్ధ ప్రభావం ప్రజలపై పడుతోంది.

ధరాఘాతం..

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఇరాన్‌-ఇజ్రాయిల్‌, అమెరికా దేశాల మధ్య జరుగు తున్న యుద్ధ ప్రభావం ప్రజలపై పడుతోంది. నిత్యా వసర వస్తువుల ధరలు పెరిగాయి. టిఫిన్లు సెంటర్లు, హోటళ్ల యజమానులు ధరలు పెంచుతుండగా, గృహ నిర్మాణ రంగంలో కూడా సిమెంట్‌, ఐరన్‌, ఇతరత్రా సరుకుల ధరలు పెరుగుతుండడంతో సామాన్య, మఽధ్య తరగతి ప్రజలు విలవిల్లాడుతున్నారు. ప్రధానంగా వంట గ్యాస్‌ కొరత ఏర్పడడం వీటన్నింటికీ కారణంగా మారింది. గృహ అవసరాలకు పలు ఆంక్షలతో ప్రస్తు తానికి గ్యాస్‌ సరఫరా చేస్తున్నప్పటికీ, కమర్షియల్‌ అవ సరాలకు గ్యాస్‌ కొరత తీవ్రంగా ఉంది. యుద్ధం కార ణంగా డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర 925 నుంచి 985 రూపా యలకు పెంచగా, కమర్షియల్‌ అవసరాలకు విని యోగించే గ్యాస్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. యుద్ధం మొదలుగాక ముందు కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర 1930 రూపాయలు ఉండగా, ప్రస్తుతం 2360 రూపాయలకు పెరిగింది. దీంతో హోటల్‌, టిఫిన్‌ సెంటర్లు, టీ, కాఫీ సెంటర్ల నిర్వాహకులు ధరలు పెంచారు. ఆయా రకాల హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు టిఫిన్‌ ధరలను 25 రూపాయల నుంచి 60 రూపా యలకు వరకు పెంచగా, మెస్‌లలో ఫుల్‌ సాదా, చికెన్‌, మటన్‌ భోజనాలపై 20 నుంచి 30 రూపాయల వరకు అదనంగా పెంచారు. దీంతో టిఫిన్లు, భోజనాలు చేసే వాళ్లు అదనపు ధరలతో ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్‌ కొరతను ఆసరా చేసుకుని హోటల్‌, టిఫిన్‌ సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతు న్నారు. కమర్షియల్‌ సిలిండర్లు దొరకకపోవడంతో డొమెస్టిక్‌ సిలిండర్లను సప్లయర్లకు అదనంగా డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు.

ఫ సలసల కాగుతున్న వంట నూనెలు..

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వల్ల వంట నూనెల తయారీకి ఉపయోగించే క్రూడాయిల్‌ సరఫరా తగ్గిపో వడంతో ముడిసరుకు అందకుండా పోతున్నది. దీంతో వంట నూనెల ధరలు పెరిగిపోయాయి. వేరుశెనగ నూనె లీటర్‌ ప్యాకెట్‌ ధర 150 ఉండగా 175 రూపా యలకు, పామాయిల్‌ ప్యాకెట్‌ ధర 140 నుంచి 170 రూపాయలకు, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ప్యాకెట్‌ ధర 150 నుంచి 170 రూపాయలకు పెరిగింది. వీటితో పాటు రవాణా చార్జీలు కూడా పెరుగుతున్నాయి.

ఫ పరిశ్రమలకు సరఫరా చేసే డీజిల్‌ ధర పెంపు

పరిశ్రమలకు నేరుగా సరఫరా చేసే డీజిల్‌ ధరలు కూడా పెరగడంతో వాటిలో తయారు చేసే సరుకుల ధరలు కూడా పెరిగాయి. లీటర్‌ డీజిల్‌ ధర 87.57 పైసల నుంచి 109.50 రూపాయలకు పెంచడంతో ఆయా పరిశ్రమల్లో ఉత్పత్తి వ్యయం పెరిగింది. జిల్లాలో సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌, సిమెంట్‌ ఫ్యాక్టరీల్లో డీజిల్‌ వినియోగం ఎక్కువగానే ఉంటుంది. ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో ఉండే పరిశ్రమల్లో తయారయ్యే వస్తువుల ధరలు కూడా పెరిగాయి. గృహ నిర్మాణానికి ఉపయోగించే సిమెంట్‌, ఐరన్‌, ఇతరత్రా వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. పశ్చిమాసియా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అన్నింటిపై పడుతుండడంతో నిత్యావసర సరుకుల నుంచి మొదలుకుని అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగు తుండడంతో పేద, మధ్య తరగతి ప్రజల బతుకుల లెక్కలు తలకిందులవుతున్నాయి.

Updated Date - Apr 03 , 2026 | 01:06 AM