Share News

సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు

ABN , Publish Date - Mar 22 , 2026 | 12:25 AM

జిల్లాలో సమస్యలు తలెత్తకుండా ముంద స్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే చట్టాల పై పోలీస్‌ అధికారులతోపాటు సిబ్బంది అవ గాహన పెంపొందించుకోవాలని మల్టీజోన్‌-1 ఐజీపీ చంద్రశేఖర్‌రెడ్డి కోరారు.

సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు

సిరిసిల్ల అర్బన్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో సమస్యలు తలెత్తకుండా ముంద స్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే చట్టాల పై పోలీస్‌ అధికారులతోపాటు సిబ్బంది అవ గాహన పెంపొందించుకోవాలని మల్టీజోన్‌-1 ఐజీపీ చంద్రశేఖర్‌రెడ్డి కోరారు. సిరిసిల్ల జిల్లా పోలీస్‌ కార్యాలయాన్ని శనివారం సందర్శిం చారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ముందు గా పోలీసు అధికారులు పూల మొక్కలను అందించి స్వాగతం పలుకగా, సాయుధ పోలీ స్‌ బలగాలతో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్‌ కార్యాలయాన్ని పరిశీలించి జిల్లా పోలీస్‌ అధికారులతో సమీక్షా సమావే శాన్ని నిర్వహించి సర్కిల్‌ల వారీగా శాంతి భద్రతల పరిస్థితులను అడిగి తెలుసుకు న్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచిం చారు. ప్రజలకు భద్రతాభావం కలిగేలా సమ ర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచిం చారు. పోలీస్‌ అధికారులు, సిబ్బంది చట్టా లపై లోతైన అవగహన పెంపొందించుకోవా లని నమోదు అయిన కేసుల్లో దర్యాప్తు నాణ్య తలను మెరుగుపరుస్తూ ప్రజలకు వేగవంత మైన న్యాయం అందేలా పోలీస్‌ యంత్రాం గం మరింత సమర్థవంతంగా పని చేయా లని అన్నారు. అన్ని పోలీస్‌ స్టేషన్‌లలో 5జీ లో భాగంగా రికార్డుల నిర్వహణను సక్రమం గా ఉంచాలని జిల్లాలో ప్రోయాక్టివ్‌, విజి బుల్‌, కమ్యూనిటీ పోలీసింగ్‌పై దృష్టి సారిం చాలని చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై గంజా యివంటి మాదక ద్రవ్యాలపై నిఘా కఠిన తరం చేయాలని ఆదేశించారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రతి వ్యక్తి సురక్షితంగా ఇంటికి చేరే లక్ష్యంతో చేపట్టిన అరైవ్‌-అలైవ్‌ కార్యక్రమాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠా త్మకంగా చేపట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణా ళికలో భాగంగా అన్ని శాఖలు సమన్వయం తో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లా లని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్‌పీ నాగేంద్రచారి, సీఐలు శ్రీనివాస్‌, నాగేశ్వర్‌రావు, వెంకటేష్‌, గాండ్ల వెంకటేశ్వర్లు, ఆర్‌ఐలు మధుకర్‌, రమేష్‌, యాదగిరి, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2026 | 12:25 AM