బాలికలపై లైంగిక నేరాలను నిరోధించడం అందరి బాధ్యత
ABN , Publish Date - Nov 01 , 2026 | 12:37 AM
బాలల పరిరక్షణ, బాలికలపై లైంగిక నేరాలను నిరోధించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పి లక్ష్మణాచారి అన్నారు.
సిరిసిల్ల టౌన్, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి) : బాలల పరిరక్షణ, బాలికలపై లైంగిక నేరాలను నిరోధించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పి లక్ష్మణాచారి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని నెహ్రునగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలం గాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు పి నీరజ సూచనలతో సురక్షిత్ బచ్ప న్ అభియాన్ పేరుతో విద్యార్థినుల కు బాలల హక్కులపై, అవగాహన కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి లక్ష్మణాచారి మాట్లాడా రు. ఆడ పిల్లలకు తమ హక్కుల గురించి, మంచి స్పర్శ - చెడు స్పర్శ గురించి, అపరిచితులు తెలిసిన వ్యక్తుల నుంచి ఎదురయ్యే ప్రమాదాల గురించి వారి వయస్సు కు తగిన రీతిలో అవగాహన కల్పించడం ఎంతో అవస రమని అన్నారు. ఫోక్సో చట్టంలోని నిబంధనాలపై విద్యా ర్థినులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పాఠశాలలో విద్యా బోధ నకు మాత్రమే పరిమితం కాకుండా పిల్లల భద్రతకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భాగ్య రేఖ, లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, న్యాయ వాదులు, పెంట శ్రీనివాస్, ఆడెపు వేణు, కళ్యాణి, ఉపా ధ్యాయులు పాల్గొన్నారు.