డిఫెన్స డ్రైవింగ్‌తో ప్రమాదాల నివారణ
ABN , Publish Date - Mar 01 , 2026 | 12:44 AM
డిఫెన్స డ్రైవింగ్ అలవాటు చేసుకుని జాగ్రత్తగా వాహనం నడిపితే 80శాతం ప్రమాదాలను నివారించవచ్చునని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు.
సీపీ అంబర్ కిశోర్ ఝా
కోల్‌సిటీ, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): డిఫెన్స డ్రైవింగ్ అలవాటు చేసుకుని జాగ్రత్తగా వాహనం నడిపితే 80శాతం ప్రమాదాలను నివారించవచ్చునని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. శనివారం అరైవ్, అలైవ్ రెండో విడత కార్యక్రమంలో భాగంగా గోదావరిఖని వనటౌన ఇనస్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక జవహర్‌నగర్‌లోని సింగరేణి వీటీసీ కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వాహనాలు డ్రైవింగ్ చేస్తున్న వారిలో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం పోలీసుల బాధ్యత అన్నారు. ప్రజల్లో శాశ్వతంగా మార్పు రావాలంటే ప్రతీ వాహనదారుడు తన మనసులోనే ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలనే సంకల్పం తీసుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం చిన్న తప్పు కాదని, అది తన కుటుంబాలకే కాక ఇతర కుటుంబాలకు కూడా అపార నష్టం కలిగిస్తుందన్నారు. ప్రాణకంటే విలువైంది ఏది లేదని, ప్రాణం ఉంటేనే ఏదైనా సాధించవచ్చునన్నారు. రహదారి భద్రత నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను ఘనంగానీయంగా తగ్గింవచ్చునన్నారు. ప్రమాదంలో తప్పు ఎవరిదన్నదానికంటే దాని వల్ల ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడుతాయో గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, వనటౌన ఇనస్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ ఇనస్పెక్టర్ రాజేశ్వర్‌రావు, రోడ్ సేఫ్టీ పెద్దపల్లి జోన ఇనచార్జి ఇనస్పెక్టర్ రమేష్‌బాబు, వనటౌన ఎస్‌ఐ మనోహర్, ట్రాఫిక్ ఎస్‌ఐ హరి శేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.