రెండో విడత జనగణనకు సన్నద్ధం
ABN , Publish Date - Oct 26 , 2026 | 01:16 AM
జనగణన రెండో విడతకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఇళ్ల గణన (హౌస్ లిస్టింగ్ ఆపరేషన్) విజయవంతంగా పూర్తయింది. 2027 ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న జనగణనకు ముందస్తు ప్రణాళిక రూపకల్పన ప్రారంభమైంది. వారం రోజుల క్రితం చార్జ్ క్లర్కులు, టెక్నికల్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమాలు మొదలయ్యాయి.
- 800 మంది జనాభాకు ఒక ఎన్యూమరేషన్ బ్లాక్
- ఒక్కో మండలాన్ని ఒక్కో చార్జ్‌గా విభజన
- చార్జ్ క్లర్కులు, టెక్నికల్ అసిస్టెంట్లకు శిక్షణ ప్రారంభం
జగిత్యాల, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): జనగణన రెండో విడతకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఇళ్ల గణన (హౌస్ లిస్టింగ్ ఆపరేషన్) విజయవంతంగా పూర్తయింది. 2027 ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న జనగణనకు ముందస్తు ప్రణాళిక రూపకల్పన ప్రారంభమైంది. వారం రోజుల క్రితం చార్జ్ క్లర్కులు, టెక్నికల్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమాలు మొదలయ్యాయి. మొదటి విడత హౌస్ లిస్టింగ్ మాదిరిగానే జన గణన కోసం ప్రతీ 800 మంది జనాభాకు ఒక ఎన్యూమరేషన్ బ్లాకుగా గుర్తించనున్నారు. ఇళ్ల గణన చేసినప్పుడు వచ్చిన గణాంకాల ఆధారంగా ఈ బ్లాకులను గుర్తిస్తున్నారు.
ఫబ్లాక్‌లను గుర్తించేందుకు..
జనగణన చేసే ఎన్యూమరేటర్‌కు పని ఒత్తిడి లేకుండా 750 నుంచి 800 మంది జనాభాను బ్లాక్‌గా గుర్తించనున్నారు. ఈ బాధ్యతలను చార్జ్ క్లర్కులు, టెక్నికల్ అసిస్టెంట్లకు అప్పగించి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. రెవెన్యూ శాఖకు చెందిన ఆర్‌ఐలు, డీటీలు, సీనియర్ అసిస్టెంట్లు ఈ చార్జ్ క్లర్కులుగా వ్యవహరించనున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లు, ఆ స్థాయి అధికారులు పనిచేస్తారు. వీరికి టెక్నికల్ అసిస్టెంట్ల సహాయంతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించి బ్లాకును గుర్తిస్తున్నారు.
ఫపక్కాగా శిక్షణ కార్యక్రమాలు..
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణన ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు గాను పక్కాగా శిక్షణ, అవగాహన కార్యక్రమాలతో అధికారులను కీలకం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్, అదనపు కలెక్టర్‌తో పాటు ఇతర జిల్లా ఉన్నతాధికారులకు సైతం ఈ జనగణన ప్రక్రియపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలకు సైతం శిక్షణ ఇవ్వనున్నారు.
ఫజిల్లాను 1,757 బ్లాక్‌లుగా విభజించే అవకాశం..
జిల్లా వ్యాప్తంగా సుమారు 1,757 బ్లాక్‌లు, సుమారు 25 చార్జ్‌లుగా ఉండనున్నాయి. జనగణన ప్రక్రియలో ఒక్కో మండలాన్ని ఒక్కో రూరల్ చార్జ్‌గా పిలవనున్నారు. మున్సిపాలిటీలను అర్బన్‌చార్జ్‌గా పేర్కొంటున్నారు. ఈ క్రమంలో జిల్లాలో 20 మండలాలు, 5 మున్సిపాలిటీలు ఉండగా ఈమేరకు చార్జ్‌లుగా విభజించే అవకాశం ఉంది. హౌస్ లిస్టింగ్ సమయంలో అధికారులు ఈ మేరకు బ్లాక్‌లను గుర్తించి మొదటి విడతలో ఇళ్ల లెక్కింపులు చేపట్టారు. అదేవిధానాన్ని జనగణనలో సైతం అమలు చేయనున్నారు.
జనగణన వివరాలు ఇలా..
------------------------------------------------------------
ఎన్యూమరేషన్ బ్లాక్‌ల సంఖ్య...1,757
గృహాల సంఖ్య...3,04,115
ఎన్యూమరేటర్ల సంఖ్య...1,885
సూపర్‌వైజర్ల సంఖ్య...326
మండలాల సంఖ్య...20
మున్సిపాలిటీల సంఖ్య...5
------------------------------------------------------------