Share News

వనమహోత్సవానికి మొక్కలు సిద్ధం చేయండి

ABN , Publish Date - Jul 10 , 2026 | 11:48 PM

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో త్వరలో పెద్ద ఎత్తున చేపట్టబోతున్న వనమహోత్సవానికి అవసరమైన మొక్కలను సిద్ధం చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.

వనమహోత్సవానికి మొక్కలు సిద్ధం చేయండి
సిబ్బందితో మాట్లాడుతున్న కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌

కరీంనగర్‌ టౌన్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో త్వరలో పెద్ద ఎత్తున చేపట్టబోతున్న వనమహోత్సవానికి అవసరమైన మొక్కలను సిద్ధం చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఆయన నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎల్‌ఎండీ నర్సరీ, ఫారెస్టుశాఖ నర్సరీలను పరిశీలించారు.నర్సరీల్లో పెంచుతున్న వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలతో పాటు ఎవన్యూ బ్లాక్‌ ప్లాంటేషన్‌కు అనువైన మొక్కలను పరిశీలించారు. వనమహోత్సవంలో నాటేందుకు వీలుగా ఆరోగ్యకరమైన, పర్యావరణానికి మేలు చేసే పూలు, పండ్లు, ఔషద మొక్కలను సిద్ధం చేయాలన్నారు. ఎవెన్యూ బ్లాక్‌ ప్లాంటేషన్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ఈఈ లచ్చిరెడ్డి, డీఈ శ్రీనివాస్‌, ఫారెస్టు అధికారి షౌకత్‌ హుస్సేన్‌, ఏఈ నర్మద సిబ్బంది పాల్గొన్నారు.

ఫ ఈనెల 24లోగా సర్‌ ప్రక్రియ పూర్తి చేయాలి

ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియను మరింత వేగం పెంచి నిర్ధేశిత గడువు జూలై 24లోగా పూర్తిచేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలాభారతి ఆడిటోరియంలో బీఎల్‌ఏ, సూపర్‌వైజర్లు, మానిటరింగ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే కొత్తపల్లి ఎంపిడివో కార్యాలయంలో రూరల్‌ ఏరియా బీఎల్‌వో , సూపర్‌ వైజర్లు, మానిటరింగ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అదనపు కమిషనర్‌ అయాజ్‌, డిప్యూటీ కమిషనర్‌ ఖాదర్‌ మొహియుద్దీన్‌, అసిస్టెంట్‌ కమిష నర్‌ రాజ్‌మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2026 | 11:48 PM