Share News

ప్రమాదకర లక్షణాలున్న గర్భిణులను గుర్తించాలి

ABN , Publish Date - Feb 24 , 2026 | 11:58 PM

ప్రమాదకర లక్షణాలు ఉన్న గర్భిణులను గుర్తించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్ట ర్‌ రజిత అన్నారు.

ప్రమాదకర లక్షణాలున్న గర్భిణులను గుర్తించాలి

సిరిసిల్ల టౌన్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : ప్రమాదకర లక్షణాలు ఉన్న గర్భిణులను గుర్తించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్ట ర్‌ రజిత అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రం డీఎంహెచ్‌వో కార్యా లయంలో జిల్లాలోని ప్రాథమిక వైద్యాధికారులతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రజిత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు సాధరణ ప్రసవాలను ప్రోత్సహిస్తుందన్నారు. ప్రమాదకర లక్షణాలున్న గర్భిణుల ను గుర్తించి డాక్టర్‌ పర్యవేక్షణలో పరీక్షలు చేయించాలన్నారు. ఆరోగ్య కేంద్ర పథకాల నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని సూచించారు. మాతా శిశు సంరక్షణ ప్రోగ్రామ్‌ అధికారి డాక్టర్‌ నాగేంద్రబాబు, వైద్యులు సం పత్‌, రామకృష్ణ, వైద్యాధికారులు పాల్గొన్నారు.

సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడవచ్చు..

గుండెపోటు వచ్చిన వ్యక్తులకు సరైన సమయంలో సీపీఆర్‌ చేస్తే ప్రాణాలను కాపాడవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ రజిత అన్నారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో మం గళవారం రాష్ట్రీయ బాల స్వస్థ ఆరోగ్య వైద్యాధికారులు, ఆరోగ్య కార్య కర్తలు, స్టాఫ్‌ నర్సులకు సీపీఆర్‌పై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భం గా డాక్టర్‌ రజిత మాట్లాడుతూ వ్యక్తుల గుండెతో పాటు శ్వాసక్రియ ఆగిపోయనప్పుడు ప్రాణాలను కాపాడడం కోసం సీపీఆర్‌ చేయాలని అన్నారు. అనంతరం వైద్యులు సీపీఆర్‌పై మరింత అవగాహన కల్పి స్తూ శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు వైద్యులు రామకృష్ణ, అనిత, వేణుమాదవ్‌, ఆర్‌బీఎస్‌కే వైద్యాధికారులు, ఫార్మాసి స్టులు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 11:58 PM