ఇంటి పరిసరాల్లో నీరు నిల్వకుండా జాగ్రత్తలు
ABN , Publish Date - Jul 28 , 2026 | 11:45 PM
వర్షాకాల నేపథ్యంలో దోమలు విజృంభించే పరిస్థితి ఉందని, పట్టణ ప్రజలు ఇంటిపరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్ ఏంజెలా ఆల్ర్ఫెడ్ సూచించారు.
వేములవాడ, జూలై 28 (ఆంధ్రజ్యోతి): వర్షాకాల నేపథ్యంలో దోమలు విజృంభించే పరిస్థితి ఉందని, పట్టణ ప్రజలు ఇంటిపరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్ ఏంజెలా ఆల్ర్ఫెడ్ సూచించారు. వేములవాడ సాయినగర్‌లో డ్రైడే కార్యక్రమాన్ని పర్యవేక్షించి, తెలంగాణ సాంఘీక సంక్షేమ గురకుల పాఠశాల, జూనియర్ కళాశాల హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నా ణ్యత, తాగునీటి సౌకర్యాలు, పారిశుధ్యం, వంటశాల పరిశుభ్రత, మరుగు దొడ్ల నిర్వహణతో పాటు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, అనారోగ్య లక్ష్యణాలు కనిపిస్తే వెంటనే ఉపాధ్యాయులు, వైద్య సిబ్బందికి తెలియజే యాలని సూచించారు. వేములవాడ పట్టణంలోని సాయినగర్‌లో నిర్వహి స్తున్న డ్రైడే కార్యక్రమాలను డిఎంహెచ్‌వో పరిశీలించారు. దోమలవ్యాప్తిని అరికట్టేందుకు ఇంటిపరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాల ని, ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటిస్తూ నీటి నిల్వ పాత్రలను ఖాళీ చేసి శుభ్రపరచాలని సూచించారు. డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా వంటి వ్యాధుల నివారణకు ప్రజల భాగస్వామ్యం అవసరమని తెలిపారు. వెంట హెల్త్ సూపర్‌వైజర్, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు ఉన్నారు.