Share News

వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాలి

ABN , Publish Date - Apr 18 , 2026 | 12:09 AM

వేసవి కాలంలో తీసుకునే జాగ్రత్తలను తెలియజేయాలని వైద్యులకు కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సూ చించారు.

వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాలి

సిరిసిల్ల టౌన్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి) : వేసవి కాలంలో తీసుకునే జాగ్రత్తలను తెలియజేయాలని వైద్యులకు కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సూ చించారు. శుక్రవారం జిల్లా కేంద్రం అంబేద్కర్‌నగర్‌లోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ను కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ల్యాబ్‌, ఇన్‌ పేషెంట్‌ వార్డు, వ్యాక్సిన్స్‌, ఓపీ రిజిస్టర్స్‌ను పరిశీలించారు. అనంతరం ప్రతిరోజు ఆసుపత్రికి ఎంత మంది రోగులు వస్తున్నారో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గర్భిణీల రిజిస్ట్రేషన్‌, టీకాలు, మందుల పంపిణిపై ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి అనారోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు తెలియజే యాలని రోగులకు మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట వైద్యురాలు రేణుక, ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు.

Updated Date - Apr 18 , 2026 | 12:09 AM