- ఫైళ్లు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
ABN , Publish Date - Aug 05 , 2026 | 11:50 PM
త్వరలో ప్రారంభం కానున్న నూతన కలెక్టరేట్ భవనానికి కార్యాలయాల తరలింపు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.
సుభాష్‌నగర్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): త్వరలో ప్రారంభం కానున్న నూతన కలెక్టరేట్ భవనానికి కార్యాలయాల తరలింపు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. నూతన కలెక్టరేట్ భవనాన్ని కలెక్టర్ బుదవారం పరిశీలించారు. ప్రతి బ్లాక్‌కు సంబంధించిన కార్యాలయాల వివరాలను డయాగ్రామ్ రూపంలో సిద్ధం చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. ఏ శాఖ ఎక్కడ ఉన్నదో స్పష్టంగా కనిపించేలా కార్యాలయాల కేటాయింపు చేపట్టాలని సూచించారు. కలెక్టరేట్‌లో పనిచేసే అధికారులు, ఉద్యోగుల వివరాలను సేకరించి, ప్రఽణాళిక ప్రకారం సిట్టింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ప్రారంభానికి ముందే మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. మీటింగ్‌హాలుతోపాటు వీవీఐపీల సమావేశాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఫైళ్లు, ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర సామగ్రి దెబ్బతినకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో షర్మిల, డీఆర్వో స్వామి, ఏవో సుధాకర్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ కాళీచరణ్, ఆర్‌అండ్‌బీ ఈఈ కుమారస్వామి పాల్గొన్నారు.