‘ప్రజావాణి’ ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి
ABN , Publish Date - Mar 10 , 2026 | 12:57 AM
ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువెత్తాయి.
సిరిసిల్ల అర్బన్, మార్చి 9 (ఆంధ్రజ్యోతి) : ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువెత్తాయి. ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదులను జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని, ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరుకావాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశిం చారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూల నుంచి ప్రజలు తరలివచ్చారు. కలెక్టర్ గరి మ అగ్రవాల్‌తోపాటు అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా అధికారులను కలిసి సమస్యలను విన్నవించి ఫిర్యాదులను అందించారు. ఈ ప్రజావాణిలో 179 ఫిర్యాదుల వచ్చాయి. ఇందులో రెవెన్యూకు 53, గృహనిర్మాణ శాఖకు 29, డీఆర్‌డీవో 20, జిల్లా సంక్షేమ శాఖకు 14, జిల్లా పంచాయతీ అధికారికి 12, సెస్ ఎండీకి 12, ఉపాధికల్పన శాఖకు 4, వైద్య ఆరోగ్య శాఖకు 4, పంచాయతీరాజ్ ఈఈ 4, పౌరసరఫరాల శాఖకు 3, ఎస్సీ సంక్షేమ శాఖ 3, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌కు 3, విద్యాశాఖ 2, ఆర్‌అండ్‌బీ ఈఈకి 2, నీటి పారుదల శాఖకు 2, సిరిసిల్ల మున్సిపాల్టీకి 2, మిషన్ భగీరథకు 2, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్‌కు 1, జిల్లాప్రణాళిక అధికారికి 1, జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి 1, ఎక్సైజ్ శాఖకు1, గిరిజన సంక్షేమ శాఖకు 1, డీపీఆర్‌వోకు 1, పశుసంవర్థక శాఖకు 1, ఎస్సీ కార్యాలయానికి 1 చొప్పున ఫిర్యాదులు రావడంతో వీటి సంబంధిత జిల్లా అధికారులకు అందించి సకాలంలో పరి ష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులను ఎన్ని పరిష్కరించారనే విషయాన్ని అధికారులను అడిగితెలుసుకున్నారు. ఫిర్యాదులను అన్‌లైన్‌లో పరిష్కరించాలని పెండింగ్‌లో పెట్టవద్దని ఆదేశించారు. అన్నిశాఖల అధికా రులు, బాధ్యులు తప్పనిసరిగా ప్రజావాణికి హాజరుకావాలని స్పష్టంచేశారు. సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, వేములవాడ ఆర్డీవో రాధాబాయి పాల్గొన్నారు.
కొలనూర్‌లో అక్రమ వెంచర్‌లపై చర్యలు తీసుకోవాలి
కోనరావుపేట మండలం కొలనూర్‌లో వెలసిన అక్రమ వెంచర్‌లపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు సోమవారం సిరిసిల్ల కలెక్టరేట్ కు తరలివచ్చి కలెక్టర్‌ను కలిసి వినతి పత్రాన్ని అందించారు. గ్రామంలోని సర్వేనంబర్ 293/సీలో 38 గుంటలు, సర్వేనంబర్ 764/ ఏలో, 472/ఈ, 671/డీ, 702/సీ, 732లలొ 12 ఎకరాల భూమిని ప్రభుత్వ నిబందనలకు వ్యతిరేకంగా ప్లాట్లు ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారన్నారు. దీనిపై విచారణ చేపట్టి అక్రమవెంచర్‌లపై చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన తూడి దేవేందర్‌రావు, శేఖర్, తిరుపతిలు కోరారు.
కంప్యూటర్ అపరేటర్ల సమస్యలు పరిష్కరించాలి
తమ సమస్యలను పరిష్కరించి పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ ఈ పంచాయితీ కంప్యూటర్ ఆపరేటర్స్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు పూరెళ్ల రఘవరన్, ప్రధానకార్యదర్శి మంగేళ్ల అనంద్‌లు కోరారు. జిల్లా అసోషియేష న్ ఆధ్వర్యంలో సోమవారం ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు కలెక్ట రేట్‌కు తరలివచ్చి కలెక్టర్ గరిమ అగ్రవాల్‌ను కలిసి సమస్యలను విన్న వించి వినతి పత్రాన్ని అందించారు. సుమన్, ప్రియాంక, రాజశేఖర్, ధనోజ్, హరీష, శ్రీధర్, భాస్కర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
జీపీల పెండింగ్ బిల్లులను చెల్లించండి
గ్రామాల్లో చేపట్టి అభివృద్ధి పనులకు పెండింగ్ బిల్లులతోపాటు బకాయి లను చెల్లించాలని మాజీసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు అక్కెనపల్లి కరు ణాకర్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్‌కు సోమవారం జిల్లా మాజీ సర్పంచ్‌ల ఫోరం ఆధ్వర్యంలో పలువురు మాజీ సర్పంచ్‌లందరు తరలివచ్చి కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. కేశవరావు, కోలా నర్సయ్య, అరె మహేందర్, వెంకట నరసింహారెడ్డి, మల్యాల దేవయ్య, రాసురి రాజేష్, చిట్నేని శ్రీనివా స్‌రావు,ఊరడి రాంరెడ్డి, చల్లనారాయణ, జిన్నా అనిల్, కటుకం మల్లేశం, రొండ్ల తిరుపతిరెడ్డి, పల్లె నర్సింహా రెడ్డి, మాట్ల అశోక్ పాల్గొన్నారు.
రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలతో పాటు జిల్లా పరిషత్‌లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను పరిష్కరించాలని రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్య క్షుడు మల్లారపు పురుషోత్తం కోరారు. కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో శ్రీనివాస్, అశోక్‌రెడ్డి, రాం మోహన్ తదితరులు పాల్గొన్నారు.
‘చలో అసెంబ్లీ’కి అనుమతులు ఇవ్వాలి
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని, సెంట్రలైజ్డ్ కిచన్‌ల జీవోలను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలంటూ ఈనెల 16న చలో అసెం బ్లీకి వెళ్లేందుకు కార్మికులకు అనుమతి ఇవ్వాలని ఏఐటీయూసీ తెలంగాణ మధ్యాహ్న భోజనం పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం లక్ష్మణ్‌యాదవ్ కోరారు. ఈమేరకు కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్ ను కలిసి సమ్మె నోటీసులను అందించారు. జిల్లా అధ్యక్షురాలు నడిగొట్టు లక్ష్మీ, గంగజల, మమత, భాగ్య, భవన, రాజవ్వ తదితరులు పాల్గొన్నారు.
పెనాల్టీ, వడ్డీ మాఫీ చేయాలి
డిఫాల్ట్ మిల్లర్లకు విధించిన 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీ మాఫీ చేసి నాలుగు వాయిదాల్లో బియ్యం పట్టి సప్లయ్ బాకీ తీర్చేందుకు అవకా శం కల్పించడంతో పాటు మిల్లర్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకా యిలను ఇప్పించాలని రైస్‌మిల్లర్ల అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు చేపూరి నాగరాజు, రారైస్‌మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు పబ్బ నాగరాజులు కోరా రు. కలెక్టరేట్‌కు సోమవారం రైస్‌మిల్లుల యజమానులు తరలివచ్చి కలెక్ట ర్‌ను కలిసి వినతి పత్రాలను అందించారు. రైస్‌మిల్లర్లు రాజిరెడ్డి, శ్రీనివాస్, గరిపెల్లి ప్రభాకర్, అనిల్ రావు, వంశీధర్‌రావు, సత్యంరావు, పబ్బ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.