Share News

‘ప్రజావాణి’ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

ABN , Publish Date - Jun 09 , 2026 | 12:18 AM

ప్రజావాణిలో పెన్షన్‌ల ఫిర్యా దులు వెల్లువెత్తాయి.

‘ప్రజావాణి’ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

సిరిసిల్ల అర్బన్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి) : ప్రజావాణిలో పెన్షన్‌ల ఫిర్యా దులు వెల్లువెత్తాయి. పెన్షన్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని సోషల్‌ మీడి యాలో జరిగిన ప్రచారంతో సోమవారం కలెక్టరేట్‌కు జిల్లా నలుమూల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి వచ్చారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కారించి ప్రజలకు న్యాయం చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వచ్చి కలెక్టర్‌తోపాటు జిల్లా అధికారులను కలిసి ఫిర్యాదులను అందించారు. ప్రజావాణిలో 154 ఫిర్యాదులు వచ్చాయి. వీటి సంబంధిత జిల్లా అధికారులకు అందించి సకా లంలో పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణిలో ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులను పెండింగ్‌ లో పెట్టవద్దని ఆదేశించారు. అన్నిశాఖల అధికారులు బాధ్యులు తప్పనిసరి గా ప్రజావాణికి హాజరుకావాలన్నారు. అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, గృహ నిర్మాణశాఖ పీడీ వెంకటమాధవరావు తదితరులు పాల్గొన్నారు.

డివిజన్‌ స్థాయిలో ‘ప్రజావాణి’ని సద్వినియోగం చేసుకోవాలి

కలెక్టరేట్‌తోపాటు సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో కార్యాలయాల్లో సోమవా రం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకో వాలని కలెక్టర్‌ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సిరిసిల్ల, వేముల వాడ రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతోందని, స్థాని క ప్రజలు తమ దరఖాస్తులను ఆర్డీవోలకు అందించాలని కలెక్టర్‌ కోరారు.

ఎస్సీలకు కేటాయించిన భూములను కాపాడండి..

కోనరావుపేట మండల నాగారంలోని నిరుపేదల ఎస్సీలకు 1999లో అప్పటి ప్రభుత్వం ఇళ్లను నిర్మించుకునేందుకు గ్రామశివారులోని సర్వే నం బర్‌ 47లో స్థలాలు మంజూరుచేసి అందించిందని తెలిపారు. అయితే ఆ భూముల్లో గుడిసెలు వేసుకుని నివాసం ఉండడంతోపాటు టేకు మొక్కల ను సైతం నాటుకున్నామని, ఆ భూములను గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు తమ స్థలాల చుట్టూ ఉన్న హద్దురాళ్లను తొలగించి నిర్మిం చిన అంతర్గత రహదారులను ధ్వంసం చేయడంతో పాటు తాము నాటు కున్న టేకు చెట్లలను తొలగించారని, దీనిపై విచారణ జరిపించి భూముల ను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో గడప చిలుకవ్వ, గడప లక్ష్మీ గడప ఎల్లవ్వ, విజయ, మ్యాక పుష్ప,నర్సవ్వ, దేవరాజవ్వ, లచ్చవ్వ పాల్గొన్నారు.

తప్పుగా నమోదు చేసిన దానిని రద్దు చేయాలి

సిరిసిల్ల అర్బన్‌ పరిఽధిలోని పెద్దూర్‌ గ్రామశివారులోని సర్వేనంబర్‌ 402, 402/1లో ఉన్న 9ఎకరాల 20 గుంటల భూమి పూర్వీకుల నుంచి వారస త్వంగా వస్తోందని, ఆ భూమిని తమకు తెలియకుండా తప్పుగా నమోదు చేశారని, దానిని రద్దు చేయాలంటూ వారసులు సోమవారం కలెక్టరేట్‌కు తరలివచ్చి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ను కలిసి సమస్యను విన్నవించి వినతి పత్రాన్ని అందించారు. సర్వే నంబర్‌లో తమ పూర్వీకులైన చీకోటి ఎల్లయ్య, రామయ్య, భూమయ్య అనే అన్నదమ్ములకు చెందిన భూములకు తాము వారసులుగా ఆ భూములను సాగు చేసుకుంటున్నామని తెలిపారు. ఈ భూమిని 2017లో తప్పుడు రిజిస్ట్రేషన్‌ను గ్రామానికి చెందిన వారు చేసుకు న్నారని, అయితే రెవెన్యూ అఽధికారులు వారుసులమైన మాకు సమాచారం ఇవ్వకుండా రిజిస్ట్రేషన్‌ చేయడం జరిగిందన్నారు. ఈ తప్పుడు రిజిస్ట్రేషన్‌ల ను రద్దు చేసి తమకు ఆ భూమిని ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో దాసరి దేవయ్య, జిన్ను దేవయ్య, బల్గూరి లావణ్య, ఎల్లవేణి అనసూయ, లక్ష్మీ, ఎం సద్య, చీకోటి లచ్చవ్వ, దాసరి అంజయ్య, శ్రీరాముల వెంకటేశం,శ్రీరాముల లక్ష్మీ, సత్యనారాయణ, బోయిని రాజయ్య, రాములు పాల్గొన్నారు.

డబుల్‌బెడ్‌రూంను నిర్మించకుండానే తీర్మానం

తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లె గ్రామంలో గత ప్రభుత్వం మం జూరు చేసిన డబుల్‌ బెడ్‌రూంలను 10 మంది లబ్ధిదారులు నిర్మించుకుని డబ్బుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న తరుణంలో డబుల్‌ బెడ్‌ రూంను నిర్మించకుండా నిర్మించుకున్నట్లు గ్రామపంచాయతీలో పాలకవ ర్గం తీర్మానం చేసిందని దీనిపై కలెక్టర్‌ విచారణ జరపాలని లబ్ధిదారులు కోరారు. కలెక్టర్‌ స్పందించి తమకు న్యాయం జరిగేలా డబ్బులను ఇప్పిం చాలంటూ గోడిసెల కిషోర్‌,శంకయ్య, చిట్యాల కమలాకర్‌, మునిగే మహేం దర్‌, ఎడ్ల జలపతి, మునిగే శ్రీనివాస్‌ తదితరులు కోరారు.

ప్రైవేటు స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి..

మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో ప్రైవేటు స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యాఅర్హతలు లేని వారితోనే భోధన చేయిస్తు న్నారని తంగళ్లపల్లి మండలం నర్సింహులప ల్లెకు చెందిన బొంగురపు జనార్ధన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్‌ స్పందించి ఫీజుల నియంత్రణతోపాటు బస్సుల ఫిట్‌నెస్‌లపై శ్రద్ధ చూపేవిధంగా చూడాలని కోరారు.

భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు..

ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్‌ గ్రామం లో తన పేరున వ్యవసాయ భూమిని గ్రామా నికి చెందిన జక్కురెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అతని భార్య ప్రణితలు తనకు తెలియకుండా అక్ర మంగా వారి పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేసుకు న్నారని ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్‌కు చెందిన మూల లచ్చవ్వ ఫిర్యాదు చేసింది. దీనిపై కలెక్టర్‌ పూర్తి స్థాయిలో విచారణ జరిపి తన భూమిని తన పేరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరింది.

Updated Date - Jun 09 , 2026 | 12:18 AM