‘ప్రజావాణి’ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
ABN , Publish Date - May 26 , 2026 | 12:00 AM
ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులను జిల్లా అధికారులు ఎప్పటికప్పు డు పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు.
సిరిసిల్ల అర్బన్, మే 25 (ఆంధ్రజ్యోతి) : ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులను జిల్లా అధికారులు ఎప్పటికప్పు డు పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. ప్రజావాణికి జిల్లా అధి కారులు విధిగా హాజరుకావాలన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా వాణిలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూల నుంచి ప్రజలు తరలిరావడంతో కలెక్టరేట్ కిటకిటలాడిం ది. జూన్ 2వ తేదీన నూతన పెన్షన్‌లను రాష్ట్ర ప్రభు త్వం ఇస్తుందని సోషల్ మీడియాలో ప్రకటనలు రావ డంతో బీడికార్మికులు, వింతులు, వృద్ధులు పెన్షన్ల కోసం కలెక్టరేట్‌కు తరలివచ్చారు. తమ ఫిర్యాదులను ఆన్‌లైన్ చేసుకుని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావా ణిలోకి వచ్చిన కలెక్టర్ గరిమా అగ్రవాల్‌తో పాటు అద నపు కలెక్టర్ గడ్డం నగేష్‌లను కలిసి సమస్యలను విన్న వించి ఫిర్యాదులను అందించారు. ఈ ప్రజావాణిలో 300 ఫిర్యాదుల వచ్చాయి. వీటి సంబంధిత జిల్లా అధికారు లకు అందించి సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదే శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా వాణిలో ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులను ఎన్ని పరి ష్కరించారనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసు కున్నారు. ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో పరిష్కరించాలని, పెండింగ్‌లో పెట్టవద్దని ఆదేశించారు. అన్నిశాఖల అధికా రులు, బాధ్యులు తప్పనిసరిగా ప్రజావాణికి హాజరుకా వాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కలెక్టరేట్‌తో పాటు సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో కార్యాల యాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్య క్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ ప్రజావాణిలో గృహ నిర్మాణశాఖ పీడి వెం కటమాధవరావు తదితరులు పాల్గొన్నారు.
గీతపారిశ్రామిక సహకార సంఘం భూమిని కాపాడండి..
వేములవాడ రూరల్ మండలం ఫాజుల్‌నగర్‌లో గీతా పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో 38 సంవత్స రాల క్రితం 60గుంటల భూమిని కొనుగోలు చేసి అందు లో తాటి, ఈత చెట్లను పెంచుకుంటున్నామని అయితే గ్రామానికి చెందిన రేపాక అశోక్ భూమి తమదంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలంటూ గీతా కార్మికులు కలెక్టర్‌కు విన తిపత్రాన్ని అందజేశారు.
సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలి...
బోయినపల్లి మండలం వర్ధవెల్లి గ్రామంలోని ఐదో వార్డులో సెల్ టవర్‌ను ఏర్పాటు చేస్తున్నారని, దానిని నిలిపివేయించాలంటూ గ్రామస్థులు కలెక్టర్‌కు వినతిప త్రాన్ని అందించారు. సెల్ టవర్ ఏర్పాటు చేయడానికి గ్రామపంచాయతీ తీర్మానం లేకుండానే కార్యదర్శి అను మతులు ఇచ్చారని, టవర్‌ను ఏర్పాటుతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుందని, టవర్ నిర్మాణాన్ని నిలిపి వేయించాలని నాగుల సాంబయ్య గౌడ్, శ్రీనివాస్ తదితరులు వేడుకున్నారు.
బాధితులకు పరిహారం ఇప్పించండి..
కోనరావుపేట మండలం కొలనూరులో జరిగిన అగ్ని ప్రమాదంలో తాటి, ఈత చెట్లు పూర్తిగా కాలిపోవడంతో గీతాకార్మికులకు ఉపాధి కరువైపోయిందని దీనిపై విచా రణ జరిపించి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని సర్పంచ్ జలగం అరవింద్‌రావు కోరారు. కలెక్టరేట్‌కు గీతా కార్మికులతో కలిసి వచ్చి కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించి వేడుకు న్నారు. అగ్ని ప్రమాదంలో 430 ఈత చెట్లులతోపాటు 160 తాటిచెట్లు గీతా కార్మికులు పెంచుకుంటూ వాటిపైనే అధారపడి కుటుంబాలను పోషిం చుకుంటున్నారని తెలిపారు. అగ్ని ప్రమాదంలో వనం మొత్తం కాలిపో యిందని అవనంపై అధారపడిన 60 గీతాకార్మిక కుటుంబాలకు నష్టపరి హారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
జీవనభృతిని అందించండి
మావోయిస్ట పార్టీలో పనిచేసి గత ప్రభుత్వ హయాంలో జనజీవన స్రవంతిలో కలిశానని, తనకు ప్రభుత్వం ఇస్తామన్న జీనవభృతిని కల్పించి అదుకోవాలంటూ మాజీ మావో యిస్టు జ్యోతిక్క కోరారు. కోనరావుపేట మండలం శివం గాలపల్లె గ్రామానికి చెందిన తాను మావోయిస్టు పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర కమిటీ సభ్యు రాలిగా పని చేశానన్నారు. ప్రభుత్వం పిలుపు మేరకు 2023 సంవత్సరంలో జనజీవన స్రవంతిలో కలిశాన న్నారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 3 గుంట ల నివాస స్థలంతో పాటు ఐదు ఎకరాల వ్యవ సాయ భూమిని ఇస్తామన్నారని, మూడు సంవత్సరాలు గడిచి నా ఇప్పటివరకు ఇవ్వడం లేదన్నారు. కలెక్టర్ స్పందించి తనకు నివేశ స్థలంతో పాటు వ్యవసాయ భూమిని అం దించి అదుకోవాలని కోరారు.
బిల్లులు మంజూరు చేయండి..
గంభీరావుపేట మండలంలోని బరిగెలగూడెం, నర్మా ల, కోళ్లమద్ది గ్రామాల్లో గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల కాలనీలో తాగునీటి సరఫరాను మూడు సంవత్సరాల క్రితం చేపట్టానని, నీటి సరఫరా లకు సంబంధించిన బిల్లులను అధికారులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం జరుగుతుంది. కలెక్టర్ స్పం దించి అ బిల్లులను ఇప్పించాని కోళ్లమద్ది మాజీ సర్పంచ్ కేశవరావు కలెక్టర్‌ను కోరారు.