Share News

‘ప్రజావాణి’ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

ABN , Publish Date - May 11 , 2026 | 11:43 PM

ప్రజావాణిలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదును జిల్లా అధికా రులు ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని అలా గే ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరుకావాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

‘ప్రజావాణి’ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

సిరిసిల్ల అర్బన్‌, మే 11 (ఆంధ్రజ్యోతి) : ప్రజావాణిలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదును జిల్లా అధికా రులు ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని అలా గే ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరుకావాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూల నుంచి ప్రజలు తరలిరావడంతో కలెక్టరేట్‌ కిటకిటలాడిపో యింది. కలెక్టరేట్‌లో ప్రజావాణికి వచ్చిన ప్రజలందరు తమ ఫిర్యాదుల ను ఆన్‌లైన్‌ చేసుకుని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి లోకి వచ్చిన కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌తోపాటు జిల్లా అధికారులను కలిసి సమస్యలను విన్నవించి ఫిర్యాదులను అందించారు. ఈ ప్రజావా ణిలో 165 ఫిర్యాదుల వచ్చాయి. వీటి సంబంధిత జిల్లా అధికారులకు అందించి సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజావాణిలో ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యా దులను ఎన్ని పరిష్కరించారనే విషయాన్ని అధికారులను అడిగి తెలు సుకున్నారు. ఫిర్యాదులను అన్‌లైన్‌లో పరిష్కారించాలని పెండింగ్‌లో పెట్టవద్దని ఆదేశించారు. ఈ ప్రజావాణిలో గృహ నిర్మాణశాఖ పీడీ వెంకటమాధవరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2026 | 11:43 PM