ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి
ABN , Publish Date - Jun 30 , 2026 | 12:14 AM
ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.
సుభాష్‌నగర్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాఖడే, శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్‌వో స్వామితో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖలల్లో పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు, ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. హాస్టల్‌లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ల వివరాలను, విద్యార్థుల సంఖ్య, గతంలో ప్లాంట్లను మరమ్మతు చేసిన ఏజేన్సీల వివరాలను గూగుల్ షీట్‌లో నమోదు చేయాలన్నారు. ప్రజావాణిలో 225 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
ఫ రెడ్‌క్రాస్ సభ్యత్వం తీసుకోవాలి....
రెడ్‌క్రాస్ సభ్యత్వం తీసుకోవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. సమాజసేవ, ఆపదలో ఉన్నవారికి సాయం అందించేందుకు రెడ్‌క్రాస్‌లో సభ్యత్వం తీసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనే సభత్వ నమోదులో జిల్లా ముందు ఉండేలా ఉద్యోగులు భాగస్వాములు కావాలన్నారు.