పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:11 AM
సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
సిరిసిల్ల అర్బన్, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని మినీ సమావేశమందిరంలో సోమవారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ పై ఎన్నికల అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ ఎవరికి ఇవ్వొచ్చు, దానికి ఏయే ఫామ్‌లు ఇవ్వాలి, మున్సిపాలిటీల్లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్, సిబ్బంది, పోలీసుల పహరా తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. అనంతరం ఎన్నికల కౌంటింగ్ అధికారులు, సిబ్బందికి సంబంధించి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. పోలింగ్, కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు, శిక్షణ తదితర అంశాలపై ఎన్నికల నోడల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లకు ఇన్‌చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో నోడల్ అధికారులు శ్రీనివాసాచారి, లక్ష్మీరాజం, జగన్ మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్‌పాషా, సంపత్ కుమార్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.