Share News

పల్లెల్లో పడకేసిన పారిశుధ్యం

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:58 AM

గ్రామ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పరిపాలన అందించా ల్సిన పంచాయతీలే పారిశుధ్యం విషయంలో పట్టీపట్ట నట్లు వ్యవహరిస్తున్నాయి.

పల్లెల్లో పడకేసిన పారిశుధ్యం

చందుర్తి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): గ్రామ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పరిపాలన అందించా ల్సిన పంచాయతీలే పారిశుధ్యం విషయంలో పట్టీపట్ట నట్లు వ్యవహరిస్తున్నాయి. పారిశుధ్య నిర్వహణ కోసం గ్రామ పంచాయతీ జనరల్‌ ఫండ్‌ నిధుల నుంచి ఖర్చు చూపుతున్నా పరిశుభ్రత కానరావడం లేదు. పరిపాలన అధికారులు, ప్రజాప్రతినిధులు నిధులు, కాసులు కురి పించే కాంట్రాక్టు పనుల వైపు మొగ్గుచూపుతుండడంతో గ్రామాల్లో ప్రజల కనీస అవసరాలు తీర్చేవారే కరువ య్యారు. చివరికి ప్రజారోగ్యానికి చేటు తెచ్చే అపరిశు ధ్యాన్ని తొలగించేవారు కరువయ్యారు. స్వచ్చమైన గాలి, నీరు, పచ్చని పంట పొలాలు, చుట్టూ నీటి వసతితో ఎంతో ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన వాతావరణంతో కళకళలాడుతూ సస్యశామలంగా ఉండే గ్రామాల్లో ప్రస్తు తం అపరిశుధ్యంతో కొట్టుమిట్టాడుతున్నాయి. మండలం లోని ఎన్గల్‌, లింగంపేట తదితర గ్రామాల్లో ప్రస్తుతం అపరిశుధ్యం నెలకొంది. గ్రామ శివారు ప్రధాన వీధుల్లో చెత్త కుప్పలు స్వాగతం పలుకుతూ పరిసర నిర్వాసితు లకు ఇబ్బందిగా మారుతున్నాయి. చిన్న పంచాయతీల్లో సైతం ప్రభుత్వం పారిశుధ్యం మెరుగుకు చర్యలు చేప డుతున్నా ప్రజల్లో అవగాహన లోపానికి సిబ్బంది నిర్లక్ష్యం తోడై సమస్య తీరడం లేదు. గ్రామంలో పలు వీధుల్లో గల చేతిపంపుల చుట్టూ ఉండే పరిశుభ్రత సమస్య చెప్పవలసినవి కావని తీవ్ర అపరిశుధ్యం మధ్య నీటిని పట్టుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నా యని, దీని వల్ల రోగాల బారిన పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. అడుగడుగునా డ్రైనే జీలు చెత్తతో నిండి ఉన్నాయి. పలు వీధుల్లో నెలల తర బడి పోగుబడి ఉన్న చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. పరిస్థితికి తగ్గట్టుగా గ్రామాల్లో ఎక్కడ చూసినా కనీసం బ్లీచింగ్‌ చల్లిన దాఖలాలు కానరావడం లేదు. ఈ సమ స్యలు పరిష్కరించడానికి పంచాయతీ అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ దృష్టి సారించకపోవడం దురదృ ష్టకరమైన విషయం. గ్రామంలో పారిశుధ్యం గురించి మండల స్థాయి అధికారులు కూడా పట్టించుకోకపోవ డమే ఈ పరిస్థితికి కారణమని గ్రామస్తులు ఆరోపి స్తున్నారు. గ్రామంలో పారిశుధ్యం గురించి పట్టించుకో వాల్సిన అధికారులు మచ్చుకైనా పట్టించుకున్న సంఘట నలు లేవని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధు లు పారిశుధ్యంపై దృష్టి సారించి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ముక్తకంఠంతో కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీవో ప్రదిప్‌ కుమార్‌ మాట్లాడుతూ గ్రామాల్లో చెత్తచెత్తను తొలగించేందుకు కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేస్తానని పేర్కొన్నారు.

Updated Date - Mar 04 , 2026 | 12:58 AM