విలీన గ్రామాల్లో ప్రశాంతంగా పోలింగ్
ABN , Publish Date - Feb 12 , 2026 | 01:00 AM
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని విలీన గ్రామాల్లో బుధవారం మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.
సిరిసిల్ల అర్బన్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని విలీన గ్రామాల్లో బుధవారం మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అర్బన్ పరిధిలోని రగుడు, ముష్టి పల్లి, చంద్రంపేట, రాజీవ్‌నగర్, చిన్నబోనాల, పెద్దబోనాల, పెద్దూర్, ఇప్పల్ల పల్లి, సర్ధాపూర్ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా అయా గ్రామా లకు చెందిన ప్రజలందరు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెద్దూర్, ఇప్పల్లపల్లితో పాటు పెద్దబోనాల, చిన్నబోనాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రా లను ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బీగీతేలు సందర్శించి పోలింగ్ ప్రక్రి యను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అద నపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీవో వెంక టేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా, సిరి సిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ కృష్ణ తదితరు లు పాల్గొన్నారు.