టీడీపీతోనే బహుజనుల్లో రాజకీయ చైతన్యం
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:39 AM
బహు జనుల్లో రాజకీయ చైతన్యం కల్గించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి భార్గవరామ్ అన్నారు.
- టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓరుగంటి భార్గవ రామ్
- ఘనంగా ఆవిర్భావ వేడుకలు
గొల్లపల్లి, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): బహు జనుల్లో రాజకీయ చైతన్యం కల్గించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి భార్గవరామ్ అన్నారు. ఆదివారం గొల్లపల్లి మండల కేంద్రంలో టీడీపీ ఆవిర్భావ వేడుకలను పార్టీ ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా మండల కేంద్రం లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంత రం భార్గవ రామ్ మాట్లాడుతూ బహుజనుల బతుకుల్లో మార్పు తీసుకురావడమే కాకుం డా రాజకీయ చైతన్యం కల్పిం చిన మహానేత స్వర్గీయ ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. కార్యక్ర మంలో పెగడపెల్లి ఉపసర్పంచ బత్తుల ప్రదీప్, నాయకులు పొలవో ని బొంద్యాలు యాదవ్, సాంబారి సంతోష్, దేవి నర్సయ్య, ఉల్లెంగుల నందు పాల్గొన్నారు.
ధర్మపురి: మండల కేంద్రంలోని నంది చౌక్ వద్ద నిర్వహించిన వేడుకల్లో పెద్దపల్లి పార్ల మెంట్ నియోజకవర్గ అడ్‌హక్ కమిటీ సభ్యుడు, ధర్మపురి మండల టీడీపీ అధ్యక్షుడు ఉప్పుల రామకిష్టయ్య ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్ర మంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు తిరుమ న దాసు శ్రీనివాస్, నాయకులు ఒజ్జల పుల్లయ్య శాసి్త్ర, అయ్యోరు శంకరయ్య, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల అర్బన: జిల్లా కేంద్రంలో నిర్వ హించిన వేడుకల్లో టీడీపీ నిజామాబాద్ అడ్‌హక్ కమిటీ సభ్యులు సోమ నారాయణ రెడ్డి, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓరుగంటి భార్గవ్ రాం, అక్కినపెల్లి కాశీనాథం, డాక్టర్ బత్తుల ప్రదీప్, జున్ను మల్లయ్య, మగ్గిడి గంగాధర్, నేరెళ్ల జలందర్‌రెడ్డి, మోర గణేష్ తదితరులు పాల్గొన్నారు.
కోరుట్ల: పట్టణంలోని అల్లమయ్య గుట్ట ప్రాంతంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహిం చిన వేడుకల్లో నియోజకవర్గ ఇనచార్జి మానుక ప్రవీణ్‌కుమార్, నాయకులు శ్రీనివాస్, రఫీ, మారుతి, కటకం మహాదేవ్, మల్లారెడ్డి, సాగర్, రమేష్ గౌడ్, రమేష్, వాసిం, సుల్తాన్, దర్మరా జు, పోశయ్య, పెద్దిరెడ్డి, శేఖర్, మహిళ నాయకులు దివ్వ, శాంత, కళ్యాణి పాల్గొన్నారు.
రాయికల్: పట్టణంలోని అంగడి బజార్‌లో జరిగిన వేడుకల్లో టీడీపీ జగిత్యాల జిల్లా అడహక్ కమిటీ కన్వీనర్ సోమ నారాయణ రెడ్డి, నాయకులు మోర గణేష్, మహ్మద్ సాయబ్ హుస్సేన, బొల్లారపు రాజేశం, కల్లెడ రాజరెడ్డి, ఎండీ మునీర్ పాల్గొన్నారు.