వేములవాడలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
ABN , Publish Date - Feb 09 , 2026 | 12:32 AM
వేములవాడ పట్ట ణంలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించా రు.
వేములవాడ టౌన్, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): వేములవాడ పట్ట ణంలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించా రు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం వేములవాడ మున్సిప ల్ పరిధిలోని తిప్పాపూర్ బస్టాండ్ నుంచి కోరుట్ల వైపు బస్టాండ్ వర కు పోలీసు బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ ఎస్పీ రుత్విక్‌సాయి మాట్లాడుతూ అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. ప్రతి ఒక్కరు ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాలన్నారు. ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవన్నారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడానికి ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాల ప్రకారం స్వేచ్ఛాయుతంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. వేములవాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎవ రైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించినా, గోడవలు సృష్టించాలని చూసినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే విధంగా అక్రమ మధ్యం, డబ్బు, ఇతర వస్తువులు రవాణా చేస్తే సమాచారం అందించాలన్నారు. ఈ ఫ్లాగ్ మార్చ్‌లో టౌన్ సీఐ వీరప్రసాద్, ఆర్‌ఐ సురేష్, ఎస్‌ఐలు రాంమోహన్, రాజు, శ్రావణ్ యాదవ్, పోలీసులు పాల్గొన్నారు.