ప్రాక్టికల్ గైడ్‌గా ‘పీఎంజే ఆపరేషన’
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:44 AM
తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో శిక్షణలో ఉన్న 112 మంది డీఎస్పీలకు కరీంనగర్ ‘పీఎంజే’ జ్యువెలర్స్ కేసును సీపీ గౌస్‌ఆలం శనివారం కేస్ స్టడీగా వివరించారు. డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు మూడున్నర గంటల పాటు నిర్వహించిన ఈ సెషనలో పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ట్రైనీ క్షేత్రస్థాయి అనుభవాలను, కేసు వివరాలను తెలిపారు.
- ట్రైనీ డీఎస్పీలకు వివరించిన సీపీ గౌస్ ఆలం
కరీంనగర్ క్రైం, జూలై 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో శిక్షణలో ఉన్న 112 మంది డీఎస్పీలకు కరీంనగర్ ‘పీఎంజే’ జ్యువెలర్స్ కేసును సీపీ గౌస్‌ఆలం శనివారం కేస్ స్టడీగా వివరించారు. డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు మూడున్నర గంటల పాటు నిర్వహించిన ఈ సెషనలో పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ట్రైనీ క్షేత్రస్థాయి అనుభవాలను, కేసు వివరాలను తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో నిందితులు ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వివరించారు. అంత అధునాతన టెక్నాలజీని వారు ఉపయోగించినా తమవద్దన్ను సాంకేతిక పరికరాల సహకారంతో డాటాను ఎలా సేకరించింది తెలిపారు. టీమ్‌వర్క్‌తో ఈ కేసును ఛేదించామని వివరిచారు. ఈ సెషనలో ఆపరేషనలో పాల్గొన్న ఏసీపీలు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొని, నిందితులను పట్టుకోవడంలో తాము పోషించిన పాత్రను, ఎదుర్కొన్న సవాళ్లను వివరించారు. కార్యక్రమంలో కరీంనగర్ టౌన ఏసీపీ వెంకటస్వామి, రూరల్ ఏసీపీ విజయకుమార్, ఇనస్పెక్టర్లు సృజనరెడ్డి, శ్రీనివాస్, రమేష్, తిరుమల్, ప్రకాష్, సరిలాల్ పాల్గొన్నారు.