Share News

గృహావసరాలకు ఉపయోగపడే మొక్కలు పెంచాలి

ABN , Publish Date - Mar 15 , 2026 | 12:31 AM

గృహ అవసరాలకు సైతం ఉప యోగపడే మొక్కలను పెంచాలని జిల్లా కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌ అన్నారు.

గృహావసరాలకు ఉపయోగపడే మొక్కలు పెంచాలి

సిరిసిల్ల టౌన్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి) : గృహ అవసరాలకు సైతం ఉప యోగపడే మొక్కలను పెంచాలని జిల్లా కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌ అన్నారు. శనివారం ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కేంద్రం సాయిన గర్‌, జేపీనగర్‌లోని మున్సిపల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీలను కలెక్టర్‌ పరిశీలించారు. నర్సరీలో ఎన్ని రకాల మొక్కలు పెంచుతున్నారో కమిషనర్‌ను వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని రోడ్డు పక్కన ఇతర చోట్ల నాటే మొక్కలతో పాటు గృహ అవసరాలకు సైతం ఉపయోగపడే మొక్కలను పెంచాలని కమిషనర్‌కు సూచించారు. మునగ, పండ్లు మొక్కలను నర్సరీలో సిద్ధం ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రణాళిక ప్రకారం మొక్క లను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. అనంతరం ప్రజాపాలన - ప్రగతి ప్రణా ళికలో భాగంగా వార్డులో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్‌ వెంట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళచక్రపాణి, ఆర్డీవో వెంకటేశ్వర్లు, కమిషనర్‌ ఎండీ ఖాదీర్‌పాషా, సిబ్బంది, కౌన్సిలర్‌ ఆడెపు చంద్రకళ, మాజీ కౌన్సి లర్‌ ఆడెపు ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 15 , 2026 | 12:31 AM