గ్రామపంచాయతీల సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు
ABN , Publish Date - Sep 25 , 2026 | 12:23 AM
విక సిత్ గ్రామపంచాయతీ ప్రణాళికలతో గ్రామాల్లో నీటి భద్రత, మౌలిక వసతులు, వాతావరణ మార్పుల ప్రభా వాలను ఎదుర్కొనేలా ప్రణాళికలను సమగ్రంగా రూ పొందించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
సిరిసిల్ల అర్బన్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : విక సిత్ గ్రామపంచాయతీ ప్రణాళికలతో గ్రామాల్లో నీటి భద్రత, మౌలిక వసతులు, వాతావరణ మార్పుల ప్రభా వాలను ఎదుర్కొనేలా ప్రణాళికలను సమగ్రంగా రూ పొందించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం వికసి త్ గ్రామపంచాయతీ ప్రణాళికలో భాగంగా ఎల్‌నినోతో పాటు, గ్రామ అవసరాలు, వనరులు, లోటుపాట్లను గు ర్తించి వాతావరణ పరిస్థితుల ప్రభావాలను ఎదుర్కొనే లా గ్రామపంచాయతీల వారీగా సమగ్ర అభివృద్ధి ప్రణా ళికలను రూపొందించడంపై సర్పంచ్‌లు, ఎంపీడీవోలు, సంబంధిత శాఖల అధికారులతో కలె క్టర్ గరిమ అగ్రవాల్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ వీబీజీరామ్ జీ కింద ప్రతి గ్రామపంచాయతీకి సం బంధించిన అవసరాలను గుర్తించి, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులను ప్రణాళికలో చేర్చాలని సూచించారు. గ్రామాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, భవిష్యత్తులో చేయాల్సిన పను లు, సామాజిక, భౌగోళిక పరిస్థితులు, అందుబాటులో ఉన్న వనరులు, మౌలిక వసతులు, లోటుపాట్లను గుర్తిం చి, ప్రజల సూచనలకు అనుగుణంగా పనులను నిర్ణ యించాలని సూచించారు. ఈ పథకం కింద మొత్తం 370పైగా పనులు ఉండగా, స్థానిక అవసరాలకు అను గుణంగా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. గ్రా మాల్లో ప్రభుత్వ భవనాలు, కిచెన్ షెడ్, ప్రహరీల నిర్మా ణాలకు ప్లాన్ రూపొందించాలని సూచించారు. ఈనెల 27నుంచి 30వ తేదీ వరకు గ్రామ పంచాయతీల వారీగా భాగస్వామ్య ప్రణాళిక ప్రక్రియను నిర్వహించాలని అధి కారులకు సూచించారు. సిద్ధం చేసిన ప్రణాళికను అక్టో బర్ 2న గ్రామసభ ముందు ఉంచి ఆమోదం పొందేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. గ్రామసభలో అందరూ పాల్గొనేలా చూడాలని సూచించారు. చెరువుల పునరుద్ధ రణ, తెలంగాణ జలసిరి, ఇంకుడు గుంతలు, బోర్ వెల్ రీచార్జ్ నిర్మాణాలు తదితర నీటిభద్రతా పనులతో పాటు గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధికి ఉపయోగపడే మౌలిక వసతులు, వరదలు, కరువు వంటి తీవ్ర వాతావ రణ పరిస్థితుల ప్రభావాలను తగ్గించే పనులను ప్రణాళి కలో చేర్చాలన్నారు. ఎల్‌నినో, తీవ్రమైన వాతావరణ పరి స్థితుల ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని నీటి భద్రత, మొక్కల పెంపకం, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఒకే పనిని వివిధ శాఖల ద్వారా పునరావృతం కాకుండా సంబంధిత లైన్ డిపార్ట్‌మెంట్‌లతో సమన్వయం చేసుకో వాలన్నారు.గ్రామసభల్లో పాల్గొని పనుల ప్రతిపాదనలు, వివరాలు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఈసమావేశంలో డీఆర్డీవో లక్ష్మీనారాయణ, డీఏవో అఫ్జల్ బేగం, హార్టికల్చర్ అధికారి శరత్‌కుమార్, జిల్లా సంక్షే మాధికారి లక్ష్మీరాజం, పీఆర్ ఈఈ సుదర్శన్‌రెడ్డి, డీవీఏ హెచ్‌వో శ్రీధర్,ఇన్‌చార్జిడీపీవో వీరభద్రయ్య పాల్గొన్నారు.