కదం తొక్కిన గులాబీ శ్రేణులు
ABN , Publish Date - Sep 03 , 2026 | 12:25 AM
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో వైఫల్యాలను ఎత్తిచూపుతూ బీఆర్‌ఎస్ శ్రేణులు కదం తొక్కారు.
సిరిసిల్ల, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో వైఫల్యాలను ఎత్తిచూపుతూ బీఆర్‌ఎస్ శ్రేణులు కదం తొక్కారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మంగళవారానికి వెయ్యి రోజులు పూర్త యిన సందర్భంగా ఏడు రోజులపాటు కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రజాక్షేత్రంలో నిరసన తెలిపే దిశగా బీఆర్‌ఎస్ సన్నద్ధమైంది. అందులో భాగంగా బీఆర్ ఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సిరిసిల్ల కొత్త బస్టాండ్, తెలం గాణ తల్లి విగ్రహం వద్ద నుంచి భారీ ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకొని ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారం టీలపై కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 42 హామీలతో కూడిన 420అడుగుల పొడవైన భారీ ఫ్లెక్సీతో ప్రదర్శన నిర్వహిం చారు. వివిధ మండలాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, సర్పంచులు 420 హామీల ప్లకార్డులతో నిరసనలు తెలిపారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాస్కోబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు, బీఆర్‌ఎస్ సీని యర్ నాయకులు చీటీ నర్సింగరావు, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి, పట్టణ అధ్యక్షుడు చక్రపాణి, టెక్స్‌టైల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు బొల్లి రామ్మోహన్, వివిధ మండలాల అధ్యక్షులు కృష్ణహరి, వెం కటస్వామిగౌడ్, రాజిరెడ్డి, సురేందర్‌రావు, రాజన్న, తదితరులు పాల్గొన్నారు.
వేములవాడ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలు, హామీ లపై ప్రజలను చైతన్యపరుస్తూ 420 హామీల కూడిన 420 అడుగుల పొడ వైన భారీ ఫ్లెక్సీని వేములవాడ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బాకీ పడిన సంక్షేమ పథకాల బాకీ కార్డులను నివా సాలు, దుకాణాల్లో అందజేస్తూ ప్రజలకు వివరించారు. బీఆర్‌ఎస్ నియోజక వర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరు ణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏను గు మనోహర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ రామతీర్థపు మాధవి కౌన్సి లర్లు, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.