క్రీడలతో దేహదారుఢ్యం, క్రమశిక్షణ..
ABN , Publish Date - Jun 01 , 2026 | 11:37 PM
క్రీడలతో దేహదారుఢ్యం, క్రమశిక్షణ పెంపొందుతాయని శాతవాహన యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య యు ఉమేష్‌కుమార్ అన్నారు. కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో పీఈసెట్ 2026 శారీరక పరీక్షలు కొనసాగుతున్నాయి.
- శాతవాహన వీసీ ఆచార్య ఉమేష్‌కుమార్
కరీంనగర్ స్పోర్ట్స్, జూన 1 (ఆంధ్రజ్యోతి): క్రీడలతో దేహదారుఢ్యం, క్రమశిక్షణ పెంపొందుతాయని శాతవాహన యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య యు ఉమేష్‌కుమార్ అన్నారు. కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో పీఈసెట్ 2026 శారీరక పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం ఈ పరీక్షళణ/ విశ్వవిద్యాలయ క్రీడామైదానంలో ఉపకులపతి ప్రారంభించి మాట్లాడారు. మొదటి రోజు పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించామన్నారు. యువత క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ శారీరక నైపుణ్య పరీక్షల్లో పాల్గొనాలన్నారు. శాతవాహన క్రీడామైదానంలో 10 కోట్లతో స్పోర్ట్స్ గ్యాలరీని నిర్మిస్తున్నామన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలోపు సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. దీంతో రాష్ట్ర, జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలను శాతవాహన క్రీడామైదానంలో నిర్వహించే అవకాశం కలుగుతుందన్నారు. విశ్వవిద్యాలయ రిజిస్ర్టార్ ఆచార్య సతీష్‌కుమార్ మాట్లాడుతూ క్రీడలతో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. వ్యాయామ విద్య ప్రవేశ పరీక్షల కన్వీనర్ ఆచార్య రాజేష్‌కుమార్ మాట్లాడుతూ వేసవి తాపం వల్ల అభ్యర్థులు అలసిపోకుండా ఉండడానికి ఉదయం 6:30 గంటల నుంచి అన్ని సౌకర్యాలతో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. మంగళ, బుధవారాల్లో మహిళలకు శారీరక ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నామన్నారు. కార్యక్రమంలో శాతవాహన స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ నజీముద్దీన మునావర్, డాక్టర్ దీప్లా, డాక్టర్ జగన, డాక్టర్ సుధాకర్ రావు, ఆచార్య సునీల్ కుమార్, శాతవాహన ఫిజికల్ డైరెక్టర్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
ఫ రెండో రోజు 740 మంది హాజరు
శారీరక సామర్థ్య పరీక్షల్లో భాగంగా సోమవారం రెండో రోజు పురుష అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించినట్లు టీజీ పీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజేశకుమార్ తెలిపారు. బీపీఈడీ కోర్సుకు 701 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 529 మంది పరీక్షల్లో పాల్గొన్నారని, 172 మంది పరీక్షకు గైర్హాజరయ్యారని తెలిపారు. డీపీఈడీ పరీక్షకు 306 మంది దరఖాస్తు చేసుకోగా 211 మంది పరీక్షలు హాజరుకాగా, 95 మంది గైర్హాజరయ్యార్కన్నారు. శారీరక సామర్థ్య పరీక్షల్లో భాగంగా పురుష అభ్యర్థులకు 100, 800 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, హైజంప్, షార్ట్‌పుట్‌తోపాటు ఫుట్‌బాల్, వాలీబాల్, ఖో-ఖో, క్రికెట్, కబడ్డీ, హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్ క్రీడల్లో పరీక్షలు నిర్వహించామని తెలిపారు.