యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం
ABN , Publish Date - Jun 22 , 2026 | 12:42 AM
యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్పవరమని, యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు పి. నీరజ అన్నారు.
సిరిసిల్ల అర్బన్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి) : యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్పవరమని, యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు పి. నీరజ అన్నారు. అంతర్జాతీ య యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన యోగా శిక్షకులు అడెపు రవీందర్ పాల్గొని యోగా ఆసనాలు చేయించారు. అనంతరం జరిగిన సమావేశంలో ప్రధాన నాయ్యమూర్తి నీరజ మాట్లాడుతూ నిత్యం యోగా చేయడంవల్ల ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరిగి, ఆరోగ్యవంతమైన జీవన విధానం అలవాటు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు జడ్జి పుష్పలత, పోక్సో కోర్టు న్యాయ మూర్తి రాధిక జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మణచారీ, జూనియర్ సివిల్ జడ్జి మేఘన, సిరిసిల్ల బార్ అసోషియేషన్ అధ్యక్షుడు అవునూ రి రామాకాంత్‌రావు, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు.