పెట్రోల్ ధరల పెంపుతో సామాన్యులపై భారం
ABN , Publish Date - May 17 , 2026 | 12:26 AM
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపిందని సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి విమర్శించారు. సీపీఐ ఆధ్వర్యంలో కమాన చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను శనివారం దహనం చేశారు.
భగత్‌నగర్, మే 16 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపిందని సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి విమర్శించారు. సీపీఐ ఆధ్వర్యంలో కమాన చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను శనివారం దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు రాషా్ట్రల ఎన్నికలు ముగియగానే కేంద్రం వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ందన్నారు. గతంలో వాణిజ్య గ్యాస్ ధర పెంచడంతో టీస్టాల్స్, టిఫిన సెంటర్లలో ధరలు పెంచారని, పేదలు బయట టిఫిన చేయడానికి భయపడుతున్నారన్నారు. పెట్రోల్, డీజీల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని, లేకపోతే సీపీఐ ఆధ్వర్యంలో పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బోయిని అశోక్, టేకుమల్ల సమ్మయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, కొట్టె అంజలి, బామండ్ల పెల్లి యుగేందర్, బూడిద సదాశివ, నగర కార్యవర్గ సభ్యుడు గామినేని సత్యం, బాకం ఆంజనేయలు పాల్గొన్నారు.