ఉన్నత పాఠశాలలకు పీఈటీ పోస్టులు మంజూరు చేయాలి
ABN , Publish Date - Mar 23 , 2026 | 12:03 AM
రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో పీఈటీ పోస్టులను మంజూరు చేయాలని వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు బాబు శ్రీనివాస్ అన్నారు. వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం తెలంగాణ కరీంనగర్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఆదివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో సమావేశం నిర్వహించారు.
కరీంనగర్ స్పోర్ట్స్, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో పీఈటీ పోస్టులను మంజూరు చేయాలని వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు బాబు శ్రీనివాస్ అన్నారు. వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం తెలంగాణ కరీంనగర్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఆదివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1,803 ఉన్నత పాఠశాలల్లో పీఈటీలు లేరన్నారు. వ్యాయామ విద్యను మూల్యంకన సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని సమావేశం తీర్మానించింది. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆడెపు శ్రీనివాస్, కోశాధికారి డి వీరపాల్‌రెడ్డి, రాష్ట్ర అసోసియేటెడ్ అధ్యక్షుడు గిన్నె లక్ష్మణ్, రాష్ట్ర బాధ్యులు డి వీరన్న, సీహెచ్ శ్రీనివాస రావు, సంఘ బాధ్యులు రామానందతీర్థ, పోతన శ్రీనివాస్, వంగపల్లి సూర్యప్రకాష్, దత్తాత్రేయ శర్మ, ఎం రమేష్, కనకం సమ్మయ్య, ఎస్ రమేష్, బి రాజ్‌కుమార్, బన్సీలాల్, బి సత్యనారాయణ, రవీందర్ పాల్గొన్నారు.