Share News

నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఇవ్వాలి

ABN , Publish Date - Sep 19 , 2026 | 12:44 AM

జిల్లాలో నూతన పరి శ్రమల ఏర్పాటుకు నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఇవ్వాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారులను ఆదేశించారు.

నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఇవ్వాలి

సిరిసిల్ల అర్బన్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో నూతన పరి శ్రమల ఏర్పాటుకు నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఇవ్వాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవా రం జిల్లాస్థాయి ఇండస్ట్రీస్‌ ప్రమోషన్‌ కమిటీ సమావేశాన్ని కలెక్టర్‌ అధ్య క్షతన జరిగింది. టీజీఐపాస్‌, టీపైడ్‌ కింద ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, అనుమతులు కోసం ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి, ఏయే కారణాలతో నిలి చిపోయాయో అధికారులను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. టీజీ ఐపాస్‌ కింద 44, టీప్రైడ్‌ కింద 83దరఖాస్తులకు అనుమతులు జారీ అయ్యాయని అధికారులు వివరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో నూతన పరిశ్ర మల ఏర్పాటుకు ఆయాశాఖల అఽధికారులు సమన్వయంతో అనుమతులు జారీ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అధి కారి హనుమంతు నాయక్‌, లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌ రాజీవ్‌కుమార్‌, రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ బ్రాంచి మేనేజర్‌ అనిల్‌కుమార్‌, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సంగీత, ఎస్సీ కార్పొరేషన్‌ ఏడీ స్వప్న, కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారి కిరణ్‌, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్‌, ఎన్‌పీడీసీఎల్‌, టీజీ ఐఐసీ, పీసీబీ అధికారులు శ్రీనివాస్‌, విక్రమ్‌, కనకజ్యోతి, డీటీసీ పీవో అన్సారీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2026 | 12:44 AM