Share News

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

ABN , Publish Date - Jul 18 , 2026 | 12:15 AM

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూముల రీ సర్వే కార్యక్రమాన్ని చేపడుతోందని కలెక్టర్‌ చిత్రామిశ్రా తెలిపారు.

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

తిమ్మాపూర్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూముల రీ సర్వే కార్యక్రమాన్ని చేపడుతోందని కలెక్టర్‌ చిత్రామిశ్రా తెలిపారు. మండలంలోని కొత్తపల్లి గ్రామంలో నాన్‌ కెడస్ట్రాల్‌ రీసర్వే పనులను శుక్రవారం కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రీసర్వే ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా, పకడ్బందీగా చేపట్టి గడువులోగా పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సర్వే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రీసర్వే చేస్తున్న గ్రామంలో భూమి విస్తీర్ణం ఎంత ఉందని ఆరా తీశారు. సర్వే నంబర్ల వారీగా ఎలాంటి పొరపాట్లు లేకుండా ఖచ్చితత్వంతో రీసర్వే నిర్వహించాలని కలెక్టర్‌ సూచించారు. సర్వే పూర్తయిన అనంతరం భూ వివరాలను ప్రజలకు ప్రకటిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో మొదటి విడతగా 70 గ్రామాల్లో రీసర్వే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. తిమ్మాపూర్‌ మండలం కొత్తపల్లి గ్రామంలో నాన్‌ కెడస్ట్రాట్‌ రీసర్వే చేపడుతున్నామని జిల్లా కలెక్టర్‌ చిత్రామిశ్రా తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో షర్మిల, తహసీల్ధార్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌ఐ లక్ష్మారెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ఫ వేగవంతంగా ఫోర్‌లైన్‌ పనులు చేపట్టాలి

చిగురుమామిడి : కొత్తపల్లి నుంచి హుస్నాబాద్‌ వరకు నిర్మాణం చేపట్టిన ఫోర్‌లైన్‌ రోడ్డు పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ చిత్రామిశ్రా అన్నారు. శుక్రవారం మండలంలోని చిన్నముల్కనూర్‌ గ్రామాంలో ఫోర్‌లైన్‌ రోడ్డు పనులను పరిశీ లించారు. రోడ్డు నిర్మాణంలో నివాస గృహాలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రత్యామ్నాయంగా బైపాస్‌ ఏర్పాటు సాధ్యమా అనే అంశాలపై అధికారులు సమగ్రంగా అధ్యయనం చేయాలన్నారు. ప్రజాభిప్రాయం సేకరించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ (రెవిన్యూ) శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ షర్మిల, తహశీల్దార్‌ కనుకయ్య, అర్‌అండ్‌బి అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 18 , 2026 | 12:15 AM