Share News

ప్రజలకు మరింత చేరువైన ప్రజా పాలన

ABN , Publish Date - Jun 28 , 2026 | 12:38 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా అమలుచేసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికతో పాలన ప్రజలకు మరింత చేరువైందని ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి, దేవాదాయ శాఖ, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శైలజారామయ్యార్‌ తెలిపారు.

ప్రజలకు మరింత చేరువైన ప్రజా పాలన

సిరిసిల్ల, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా అమలుచేసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికతో పాలన ప్రజలకు మరింత చేరువైందని ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి, దేవాదాయ శాఖ, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శైలజారామయ్యార్‌ తెలిపారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరే ట్‌లో జిల్లాలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కింద 10 అంశాలతో 99 రోజులపాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, భవిష్యత్తు ప్రాళికల రూపకల్పనపై కలెక్టర్‌ గరీమ అగ్రవాల్‌తో కలిసి రామయ్యార్‌ సమీక్ష నిర్వహించారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి పనులు ప్రజలకు చేరవేయడం, భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించడమే లక్ష్యంగా మార్చి 6వ తేదీ నుంచి జూన్‌ 12వ తేదీ వరకు జిల్లాలో చేసిన అభివృధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, వివిధ ఫైళ్ల పరిష్కారం, ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక విజయవంతంపై జిల్లా యంత్రాంగం రూపొందించిన పీపీటీ ప్రదర్శనను జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌తో కలిసి ప్రిన్సిపల్‌ కార్యదర్శి పరిశీలించారు. ఈ సందర్భంగా శైలజా రామయ్యర్‌ మాట్లాడుతూ ప్రతి శాఖ భవిష్యత్‌ కార్యాచరణను స్పష్టంగా నిర్దేశించుకుని, 99 రోజుల కార్యక్రమం ద్వారా సాధించిన విజయాలను డాక్యుమెంటరీ రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేయడం, ఇంది రమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతి, డీ- అడిక్షన్‌ కౌన్సెలింగ్‌ కేంద్రం, రోడ్డు భద్రతలో భాగంగా సీపీఆర్‌ శిక్షణ, అవగాహన కార్యక్రమాలు, ఆరోగ్య సంరక్షణ, ఇతర పనుల్లో పురోగతిపై కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ను ప్రిన్సిపాల్‌ కార్యదర్శి శైలజ రామయ్యర్‌ అభినందించారు. ఈ సమావే శంలో అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఆర్‌వో జయశ్రీ, సీపీవో శ్రీనివాసాచారి, జడ్పీ సీఈవో వెంకట మాధవ రావు, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా పశువైద్య అధికారి రవీందర్‌ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, ఆయా మండ లాల ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 28 , 2026 | 12:38 AM