Share News

కేసీఆర్‌ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు

ABN , Publish Date - Oct 31 , 2026 | 12:01 AM

తెలంగాణలో రేవంత్‌ పోయి కేసీఆర్‌ మళ్లీ రావా లని ప్రజలు, రైతులు కోరుకుంటున్నారని బీఆర్‌ ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు.

కేసీఆర్‌ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు

సిరిసిల్ల టౌన్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో రేవంత్‌ పోయి కేసీఆర్‌ మళ్లీ రావా లని ప్రజలు, రైతులు కోరుకుంటున్నారని బీఆర్‌ ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆగయ్య మాట్లాడారు. కేసీఆర్‌ పాలనలో తెలంగాణ రైతులను కడుపు లో పెట్టుకొని రైతులకు సాగునీరు, రైతు బంధు, రైతు బీమా ఇచ్చి, రైతులు పండించిన పంటల ను కొని రైతాంగానికి అండగా నిలిచారన్నారు. ప్రస్తుతం తెలంగాణలో తుగ్లక్‌ పాలన వచ్చింద ని రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాడ ని ఆరోపించారు. ఎల్‌నినోతో వచ్చిన కరువుకా దు.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ పాలనలో, కాంగ్రెస్‌ పాలనలో విద్యుత్‌ ఎట్లా ఉంటుందో గ్రామాల్లోకి వెళ్లి రైతాంగాన్ని అడిగితే తెలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి మెప్పు కోసం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ గాంధీభవన్‌లో కూర్చుండి నిరాధారమైన ఆరోప ణలు చేస్తున్నారని కేసీఆర్‌, కేటీఆర్‌లను విమ ర్శించే స్థాయి ఆయనకు లేదన్నారు. ఆది శ్రీని వాస్‌ యదాద్రి దేవాలయం తరహాలో వేముల వాడ దేవాలయాన్ని రాతిశిలలతో నిర్మించాలని డిమాండ్‌ చేశారు. నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో వరి వేయవద్దని రైతుల నుంచి డిక్లరేషన్‌ అడగడం ఇప్పటి వరకు చూడలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చూడాల్సివచ్చిం దని విమర్శించారు. రాష్ట్రంలో ని రైతాంగం కోసం మూడు సంవత్సరాల కాంగ్రెస్‌ ప్రభు త్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, రాష్ట్ర కార్యదర్శి ప్రవీన్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సందీప్‌, జిల్లా నాయకులు రాఘవరెడ్డి, మల్లా రెడ్డి, దేవదాస్‌గౌడ్‌, కృష్ణారెడ్డి, రాజన్న, చంద్ర య్యగౌడ్‌, పూర్ణచందర్‌, సంపత్‌కుమార్‌, గెంట్యా ల శ్రీనివాస్‌, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2026 | 12:01 AM